మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైయ‌స్ జగన్‌ పాలన

ఎమ్మెల్యే రెడ్డిశాంతి

అమ‌రావ‌తి: మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పాలన సాగిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మ‌హిళా సాధికార‌త‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో రెడ్డిశాంతి మాట్లాడారు. మహిళల అభ్యున్నతి కోసం సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నార‌ని తెలిపారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నార‌ని చెప్పారు. గత ప్రభుత్వంలో మహిళలు ఎన్నో కష్టాలు పడ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళా రైతులకు సీఎం వైయ‌స్ జగన్‌ అండగా ఉంటున్నార‌ని పేర్కొన్నారు. మహిళా సంక్షేమంలో దేశంలో ఏపీ ఆదర్శంగా నిలిచింద‌ని గ‌ర్వంగా చెప్పారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మహిళలను శక్తివంతులుగా తయారు చేస్తున్నాఎమ్మెల్యే రెడ్డి శాంతి వ్యాఖ్యానించారు. ఇన్ని మేలులు చేస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌హిళాలోకం త‌ర‌ఫున ఎమ్మెల్యే రెడ్డిశాంతి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top