వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ప్ర‌చారానికి విశేష స్పంద‌న‌

వైయ‌స్ఆర్ జిల్లా:  పులివెందుల‌, బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ నెల 12న జ‌రుగ‌నున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ అరాచ‌కాలు సృష్టిస్తుండ‌గా, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఇంటింటా ప‌ర్య‌టించి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. పులివెందుల మండ‌లం ఎర్రబల్లి పంచాయతీ లోని నల్లపురెడ్డి పల్లి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి  తుమ్మల హేమంత్ రెడ్డి త‌ర‌ఫున ఎంపీ వైయ‌స్  అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గిరిధర్ రెడ్డి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఒంటిమిట్ట మండల మాధవరం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెడ్పీటీసీ సుబ్బారెడ్డి త‌ర‌ఫున  రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం  ఎస్.బి. అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.

Back to Top