కట్లేరు వాగు మీద బ్రిడ్జి మంజూరు చేయాలి

కొక్కిలిగడ్డ రక్షణనిధి, తిరువూరు
 

మేం ఇప్పుడు గెలిచింది రెండోసారు. ఈ శాసన సభలో గత ఐదేళ్లలో మాకు మాట్లాడే అవకాశం రాలేదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు 2006లో నూతిపాడు రైతులందరికీ ఎత్తిపోతల పథకం ప్రారంభించి, విస్సన్నపేట మడలంలో రైతులందరికీ దాని ద్వారా నీరందించిన ఘనత రాజశేఖర్ రెడ్డిగారికే దక్కుతుంది. ఇప్పుడా లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ మూతపడిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా మేము రెండు మూడు సార్లు అర్జీలు ఇచ్చాం. కానీ ప్రభుత్వం పట్టించుకోనే లేదు. 2006లో తెల్లదేవరపల్లి పైలెట్ ప్రాజెక్టు కూడా కట్టారు. 150 ఎకరాలకు వాటర్ స్టోరేజ్ కోసం పైప్ లైన్లు, ట్యాంకు కూడా కట్టేసారు. ఇప్పుడదని నిరుపయోగంగా మారింది. తుఫాన్లు వచ్చి గంపలగూడెం మండలంలో కట్లేరు వాగు మీద ఒక బ్రిడ్జి ఉండేది. అది వర్షానికి కొట్టుకుపోయింది. క్రిందటి ప్రభుత్వంలోని నీటిపారుదల మంత్రి దేవినేనిఉమకు ఎన్నోసార్లు  చెప్పాము కానీ పట్టించుకోలేదు. మండల్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లేదారి కనుక ఆ బ్రిడ్జిని మంజూరు చేయాల్సిందిగా మంత్రిగారిని కోరుతున్నాను. ఈ క్రాప్ నమోదు లేకపోవడం వల్ల కొద్దిమంది రైతులు మార్కెట్ యార్డుల వద్ద ఇబ్బంది పడుతున్నారు. మద్దతుధర ఇచ్చి రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రిగారు కాస్త వీరి విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను.

 

తాజా వీడియోలు

Back to Top