శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ ప్లాన్‌

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
 

గుంటూరు: పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్న, మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించాడని మండిపడ్డారు. మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఒక పిల్లాడికి తగిలిందని తెలిపారు. దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని, వారిని సముదాయించాల్సింది పోయి టీడీపీ నాయకులు బోండా సహా ఇతర నాయకులు దుర్భాషలాడటం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమని తప్పుపట్టారు. అందులో భాగంగానే 10 కార్లతో వచ్చి కావాలనే గొడవకు దిగారని తప్పుపట్టారు. ప్రజా బలం లేని చంద్రబాబు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి .. ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందక్భంగా అంబటి, ముస్తాఫాలపై దాడులు చేసి చంపడానికి యత్నించారని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో తనపై హత్యయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయినా సరే... మేం సంయమనంతో వ్యవహరించామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  

Back to Top