ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట

3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

 

విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు మూడు కేసుల్లో ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. ఇవాళ‌ ముందస్తు బెయిల్ పిటీషన్‌పై  ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టు.

కాగా, నిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలు అయ్యాయి. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు రోజురోజుకి దిగజారుతోంది. పిన్నెల్లి కౌంటింట్‌లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్ర పన్నుతోంది.  ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌కి హైకోర్టుని మరోసారి  పిన్నెల్లి ఆశ్రయించారు. హైకోర్టు విచారణలో మూడు కేసులని మే 22న‌ నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. 

 
హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు.  రికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడింది. మే 23న కేసులు నమోదు చేసి 24న స్ధానిక మేజిస్డ్రేట్‌కు తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. 

మరోవైపు ప్రభుత్వ జీఓ లేకుండా పోలీసుల తరపున ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు. తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి అశ్వినీకుమార్ గైర్హాజరయ్యారు. ఆసక్తికరంగా బాదితుల తరపున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించారు. 

Back to Top