80 శాతం హామీలు ఆరు నెలల్లోనే అమలు చేశారు

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం నభూతో నభవిష్యత్‌

శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలి

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 80 శాతం ఆరు నెలల్లోనే అమలు చేశారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన శ్మశాన వాటికలకు స్థలం కొరతపై మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..తాను చదువుకునే రోజుల్లో అలెగ్జండర్‌ గ్రీక్‌ వీరుడని, యోధుడని తెలుసని, అక్బర్‌ పరిపాలన ధక్షుడని తాను చదువు కూడా చెప్పానన్నారు. రాజకీయాల్లో చాలా మంది ఉంటారని,కొంత మంది మేనిఫెస్టో దాచుకుంటారు. కొంత మంది కనిపించకుండా చూశారు. కానీ వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన హామీలు 80 శాతం ఆరు నెలల్లో తీర్చారని తెలిపారు. పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, సామాజంలో వెనుకబడిన వారు ఇంతకంటే పరిపాలన ఏం కావాలని ఆలోచన చేస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనం ఆదా అవుతుంటే ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. తాను పీహెచ్‌డీ చేశానని, ఇంగ్లీష్‌లో చదువు చెప్పాలంటే భయపడేవాడిన అని చెప్పారు. 5వ తరగతిలో ఏబీసీడీలు నేర్చుకున్నానని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడం నభూతో నభవిష్యత్‌ అన్నారు. గత ఐదేళ్లు ఈ రాష్ట్రంలో శశ్మానాలు దారుణంగా ఉండేవన్నారు. చాలా చోట్ల ధర్నాలు చేస్తే అరెస్టులు చేయించారని గుర్తు చేశారు. ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో శశ్మాన సమస్యలు ఉన్నాయి. సీఎం వైయస్‌ జగన్‌ 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారని చెప్పారు. శశ్మానానికి అనుకూలమైన స్థలాన్ని కూడా కేటాయించాలని సీఎంను కోరారు. 

Read Also: సివిల్ స‌ప్ల‌య్‌కు కుప్ప‌కూల్చింది బాబే

Back to Top