సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటనను అందరూ స్వాగతిస్తున్నారు

ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

విజయవాడ: రాజధాని కోసం గత ప్రభుత్వం తీసుకున్న అసైన్డ్‌భూములను వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తిరిగి రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమవుతాయన్న సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటనను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. వికేంద్రీకరణతో రాష్ట్రం సమృద్ధిగా అభివృద్ధి చెందుతుందన్నారు.టీడీపీ సానుభూతిపరులే ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
 

Back to Top