విప్ల‌వాత్మ‌క పాల‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాంది

టీడీపీవి బూట‌క‌పు హామీలు

విజ‌య‌వాడ న‌గ‌రంలో ఎమ్మెల్యే విష్ణు ఎన్నిక‌ల ప్ర‌చారం

 విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో విప్ల‌వాత్మ‌క పాల‌న‌కు నాంది ప‌లికార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు పేర్కొన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చ‌విచూసినా టీడీపీ నేత‌ల తీరులో మార్పు రావ‌డం లేద‌న్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు  మేనిఫెస్టో విడుద‌ల చేసి బూట‌క‌పు హామీలు ఇస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. శ‌నివారం విజ‌య‌వాడ  ‌సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఎన్నిక‌ల ప్ర‌‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విప్ల‌వాత్మ‌క పాల‌న‌కు నాది ప‌లికార‌ని చెప్పారు. మున్నిప‌ల్ ఎన్నిక‌ల మేనిఫెస్టోను లోకే‌ష్ విడుద‌ల చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు..600 హామీల‌తో ఇచ్చిన మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్ నుంచి తొల‌గించింది   వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టింద‌న్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ చేసిన వేల కోట్ల అవినీతిపై అ‌సెంబ్లీ సాక్షిగా వివ‌రించామ‌న్నారు.  టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ 12 వేల మంది వ‌ద్ద డ‌బ్బులు వ‌సూలు చేసింద‌న్నారు.  ప‌న్నులు పెంచింది టీడీపీ హ‌యాంలో కాదా అని నిల‌దీశారు. ఇప్పుడు ఎన్నిక‌ల కోసం టీడీపీ బూట‌క‌పు హామీలు ఇస్తుంద‌ని మండిప‌డ్డారు.

Back to Top