సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర సమస్యలపైనే చర్చ‌

ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర సమస్యలపైనే చర్చించారు. పార్లమెంట్‌లోనూ మా ఎంపీలు విభజన హామీలపై అనేకమార్లు ప్రశ్నించారు. కేంద్ర ఇప్పటివరకూ పెద్దన్న పాత్ర పోషించలేదు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలు నెరవేర్చాలి. పోలవరానికి పూర్తి నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలి' అని మల్లాది విష్ణు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top