శవ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటు

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

విజయవాడ:  శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. రాజధానిలోని 29 గ్రామాల ప్రజల ఇబ్బందులకు చంద్రబాబే కారణమన్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడినా చంద్రబాబుకు సిగ్గు రాలేదని విమర్శించారు.  ప్రపంచలోనే టాప్‌ ఫైవ్‌ కన్సల్టెన్సీల్లో బోస్టన్‌ కన్సల్టెన్సీ ఒక్కటన్నారు. ఇదే బీసీజీ కమిటీతో ఐదేళ్ల పాటు చంద్రబాబు పని చేశారని గుర్తు చేశారు. రాజధానిలో చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడింది వాస్తవం కాదా అన్నారు. శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. 29 గ్రామాల ప్రజల ఇబ్బందులకు చంద్రబాబే కారణమన్నారు. 
 

Back to Top