దాహర్తి తీర్చిన సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదములు

పత్తికొండ ఎమ్మెల్యే కే.శ్రీదేవి
 

అమరావతి: పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం చూపి దాహర్తి తీర్చిన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ధన్యవాదములు తెలిపారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. వెల్దుర్తి మండలంలో 30 ఏళ్లుగా తాగునీటి సమస్య ఉంది. ఇక్కడ కేఈ కుటుంబం, కోట్ల కుటుంబాలు అధికారంలో ఉన్నా ఈ సమస్యను పరిష్కరించలేకపోయాయి.  వైయస్‌ జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఆ సమస్యను పరిష్కరించారు. కృష్ణగిరి రిజర్వాయర్‌ నుంచి 12 కిలోమీటర్లతో పైప్‌లైన్‌ ద్వారా నీటిని అందించి ప్రజల దాహర్తిని తీర్చారు. వెల్దుర్తి ప్రజల తరఫున దన్యవాదాలు తెలుపుతున్నాం. తుగ్గలి మండలంలో 14 చెరువులు ఉన్నాయి. వీటికి మరమ్మతులు చేయించాలని సీఎంను కోరాం. ఆయన వెంటనే స్పందించి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ చెరువు పనులు పూర్తి అయితే  5 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. వర్షకాలంలోపే చెరువు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు. 
 

Back to Top