నేతన్న నేస్తం ధర్మవరంలో రూపుదిద్దుకోవడం సంతోషం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
 

ధర్మవరం: చేతి వృత్తిని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారని, ఇచ్చిన మాట మేరకు చేనేతలకు వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా అండగా నిలుస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. నేను విన్నాను.. నేనున్నాను అని సమస్యలు తీర్చడానికి వచ్చాడన్నారు. ధర్మవరంలో  వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవ వేదికపై ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘నేతన్న హస్తం ధర్మవరం నుంచి రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉంది. పుట్టిన రోజు అంటే దేశ విదేశాల్లో జరుపుకుంటుంటారు.. కానీ మన ముఖ్యమంత్రి పేదల మధ్య నేతన్నలకు అండగా నిలుస్తూ జరుపుకుంటున్నారు. ఇదే గ్రౌండ్‌లో గతంలో 2016 ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో వైయస్‌ జగన్‌ చేనేతల సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేశారు. చేనేతలకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. ఆ రోజు వైయస్‌ జగన్‌ మన గడప తొక్కి మన ఊరికి వచ్చి నేనున్నాను.. నేను విన్నాను నీ సమస్యలన్నీ తీర్చడానికి అండగా ఉంటానని చెప్పారు. ఆయన చెప్పిన మాటకు నిలబడి ఆరు నెలల్లోనే మగ్గం ఉన్న ప్రతి చేనేతకు రూ.24 వేలు ఇవ్వడం సంతోషం. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నారు. 1994 నుంచి 2004 వరకు కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వలసలు వెళ్లారు. చేతి వృత్తిని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు. 37 రోజులు చేనేత కార్మికులు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు రాలేదని దీక్ష చేస్తే.. జగనన్న వచ్చి నేనున్నానని చెప్పారు. నెలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.24 వేలు జమ చేస్తామన్నారు. నెలకు కాకుండా ఒకేసారి రూ.24 వేలు వేయడం 85 వేల చేనేత కార్మికులకు ఇస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పారు.

Back to Top