నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

సత్యసాయి జిల్లా: టీడీపీ హయాంలో ధర్మవరంలో రూ.3,372 కోట్ల అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ అంటున్నారు. ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని వరదాపురం సూరీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను ధర్మవరం ఎమ్మెల్యే అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. 

వరదాపురం సూరీ నాలుగు కోట్లు లంచంగా డిమాండ్ చేయడం వల్లే గరుడంపల్లి వద్ద సోలార్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి 106 ఎకరాల భూమి కొనుగోలు చేస్తే అందులో తప్పేముందని కేతిరెడ్డి ప్రశ్నించారు. తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. 

Back to Top