అచ్చెన్నాయుడు, నిమ్మల సభను తప్పుదోవ పట్టించారు

ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు సభను తప్పుదోవ పట్టించారని ప్రివిలేజ్‌ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్న, నిమ్మలపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇస్తామని చెప్పారు. ఇవాళ కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ప్రివిలేజ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో అచ్చెన్నాయుడు పై రెండు ఫిర్యాదులు పై ప్ర‌విలైజ్ క‌మిటీ విచారించింది. సభను తప్పు దోవ పట్టించారన్న శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై అచ్చెనాయుడు పై చర్యలకు సిఫార్సు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. స్పీకరును దూషించారనే మరో  ఫిర్యాదులో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోకి తీసుకుని ప్రివిలేజ్ కమిటీ క్షమించింది. గత విచారణ లో స్పీకర్ పై వ్యాఖ్యలు కు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పారు.  నిమ్మల రామానాయుడు పై చర్యలకు ప్రివిలేజ్ క‌మిటీ సభకు సిఫార్సు చేయనుంది. మద్యం షాపుల విషయంలో అచ్చెన్న, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ నిర్దారించింది. 

స‌మావేశం అనంత‌రం కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నోటీసుల సమయంలో అందుబాటులో లేనని కూన రవి చెప్తున్నారని, అందుబాటులో ఉన్నారని ఫిర్యాదు చేసిన వారు చెబుతున్నారని తెలిపారు. ఆధారాలు సమర్పించాలని ఇరువురికి చెప్పామని పేర్కొన్నారు. ఆధారాల పరిశీలన తరువాత కూన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నిమ్మగడ్డ రమేష్‌ తనపై వచ్చిన ఫిర్యాదుపై మరింత సమాచారం కోరారని , కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్‌ కమిటీలో చర్చించకూడదనేం లేదన్నారు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 

Back to Top