చంద్రబాబు ఎంత రాద్ధాంతం చేసినా  శిక్ష అనుభవించక తప్పదు

ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

నెల్లూరు : చంద్రబాబు ఎంత రాద్ధాంతం చేసినా జరిగిన అక్రమాలకు శిక్ష అనుభవించక తప్పదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి హెచ్చరించారు. గత ఐదేళ్లలో పోలవరం పనులు, విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై టీడీపీ ప్రభుత్వం అవలంభించిన విధానాలపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పీపీఏలపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన విధానాల వల్ల ప్రజలపై 30శాతం అదనపు భారం పడింది. పీపీఏలను సమీక్షించమని హైకోర్టు ఆదేశించింది. సీఎం జగన్‌ నేతృత్వంలో నిష్పక్షపాతంగా పాలన సాగిస్తూ, గత పాలకుల అక్రమాలను వెలుగులోకి తెస్తుంటే, చంద్రబాబు ఓర్వలేక ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. గత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడింది. జీయూవిఎన్‌ఎల్‌ సంస్థ నుంచి గుజరాత్‌ ప్రభుత్వం యూనిట్‌ను రూ. 2.43కు కొనుగోలు చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం తనకు అనుకూలమైన మూడు కంపెనీల నుంచి యూనిట్‌ రూ. 4.84కు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడింది. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ మిగులు ఉన్నా.. సంప్రదాయేతర ఇంధనం పేరుతో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. చంద్రబాబు ఎంత రాద్ధాంతం చేసినా జరిగిన అక్రమాలకు శిక్ష అనుభవించక తప్పదన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top