చ‌రిత్ర‌లో నిలిచిపోయే ప‌థ‌కం "వైయ‌స్ఆర్‌ రైతు భ‌రోసా"

  ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి

 
ఉరవకొండ:  వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా ప‌థ‌కం దేశ చ‌రిత్ర‌లోనే ఒక అద్భుత పథకంగా నిలిచిపోతుంద‌ని  ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ష‌వైయ‌స్‌ఆర్‌ రైతు భరోసా - పిఎం కిసాన్‌ పథకం" కింద వరసగా నాలుగో విడత ఆర్థిక సాయం తమ ఖాతాల్లో జమ అయిన సందర్భంగా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం వైయస్‌ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి ముందే రూ.5,500 నగదు రైతుల ఖాతాలో జమ చేయడంపై వారు హర్షం ప్రకటించారు.పంటల పెట్టుబడికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని, అప్పుల భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రైతు పక్షపాతిగా, ఎన్ని ఇబ్బందులు వున్నా ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా మరోసారి నిరూపించుకున్నారని పేర్కొన్నారు.తాము ఎన్నిక‌ల స‌మ‌యంలో నాలుగేళ్ల‌పాటు ఏడాదికి రూ.12500 చొప్పున రూ.50వేలు మాత్ర‌మే అన్న‌దాత‌కు పెట్టుబ‌డి సాయం కింద ఇస్తామ‌ని హామీ ఇచ్చామ‌ని, కానీ అంత‌కు మించి ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్ల‌పాటు మొత్తం 67,500 ఆర్థిక సాయం చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.ఇప్పటి వరకు 24 వేల కోట్ల రూపాయలు నగదు రైతుల ఖాతాల్లో ఈ ప్రభుత్వం జమ చేసిందన్నారు. అనంతరం వ్యవసాయ ఎడిఏ పద్మజ, ఏవో శశికళ వారికి మొక్కను బహుకరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాతమ్మ, ఎంపిపి చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ,వైస్ ఎంపిపి నరసింహులు, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు,మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, ఉరవకొండ సర్పంచ్ లలిత,నాయకులు సిపి వీరన్న,తేజోనాత్, అశోక్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, ఎర్రిస్వామి రెడ్డి, చంద్రహాస్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రైతులు పర్వతరెడ్డి, ఎర్రినాత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లోకేష్, తిప్పేస్వామి, డోనేకల్లు నాగరాజు,పురుషోత్తంరెడ్డి, మనోహర్ రెడ్డి, శంకర్ రెడ్డి, తిమ్మారెడ్డి, ఉమాపతి రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, రైతులు,వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top