ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే మాకు 151 సీట్లు వచ్చాయి

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
 

అసెంబ్లీ: మా నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తే రక్తం మరిగిపోతోంది. గడిచిన ఐదేళ్లు పంది కొక్కుల మాదిరిగా కోట్లాది కోట్లు దోచుకున్నారు. ఇసుక, మట్టి, ప్రాజెక్టుల్లోనూ దోచుకుంటున్నారు. సీఎంపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఎస్‌...మా నాయకుడు శుక్రవారం కోర్టుకు వెళ్లడం వల్లే 151 సీట్లు వచ్చాయి. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మహానేత మరణం తరువాత చంద్రబాబు, కాంగ్రెస్‌ కుట్ర పన్ని మా నాయకుడు వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి శుక్రవారం కోర్టుకు పంపిస్తున్నారు. వీరి కుట్రలు చూసే ప్రజలు వైయస్‌ జగన్‌కు 151 సీట్లు  ఇచ్చారు. టీడీపీ నేతల మాటలకు కడుపు మండిపోతుంది. ఇదే అసెంబ్లీ కాకపోతే కథ వేరేలా ఉండేది. టీడీపీ సభ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్ష సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top