చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు టీడీపీ సిద్ధమా?

రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?

టీడీపీ నేతలకు కంటి చూపు మందగించింది

ఐటీ ప్రెస్‌నోట్‌ను క్షుణంగా చదివితే అసలు బండారం బయటపడుతుంది

కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో టీడీపీ నేతలకు బాగా తెలుసు

యనమలకు పంటి నొప్పితో పాటు కంటి చూపు పోయింది

యనమలకు కంటి వైద్యం చేయించాలని సీఎం వైయస్‌ జగన్‌ను కోరుతా

దమ్ము,ధైర్యం ఉంటే ఐటీ అధికారులపై డిఫర్మెషన్‌ వేయండి

ఐటీ దాడులపై బాబు సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఎందుకు స్పందించడం లేదు

టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబుకు వెన్నుపోటు పొడుస్తారు

ఇక జైలు జైలు చంద్రన్న అని పాడుకోవాల్సిందే

దేశంలోనే మోస్టు క్రిడిబుల్‌ పార్టీ వైయస్ఆర్‌సీపీ

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

తాడేపల్లి: చంద్రబాబు సంపాదన, ఆస్తులపై సీబీఐ విచారణకు తెలుగు దేశం పార్టీ సిద్ధమా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సవాలు విసిరారు. అలా కాదంటే రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలపై ఐటీ శాఖపై పరువు నష్టం దావా వేసే దమ్ము, ధైర్యం ఉందా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. బాబు సొంత పుత్రుడు, దత్త పుత్రుడు ఎందుకు స్పందించడ లేదని నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. 
ఇటీవల ఐటీ దాడుల్లో వెలుగు చూసిన రూ.2 వేల కోట్ల  పత్రికా ప్రకటన ద్వారా ప్రజల ముందు పెట్టింది. ఈ వాస్తవాలు చూసిన తరువాత టీడీపీకి భయం పట్టుకుంది. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌, అందులో పేర్కొన్న అంకెలను టీడీపీ నేతలు స్పష్టంగా చదువుకోవాలి. ఐటీ ప్రెస్‌నోట్‌లో రూ.2 వేల కోట్లు అని క్లియర్‌గా ప్రకటించారు. నేరారోపణ రూ.2 వేల కోట్లు అని ఐటీ శాఖ చెప్పినా కూడా టీడీపీ నేతలు వింతగా మాట్లాడుతున్నారు. రూ.2 వేల కోట్లకు 2 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో అంటూ వైయస్‌ఆర్‌సీపీపై టీడీపీ విమర్శలు చేయడం గత నాలుగు రోజులుగా చూస్తున్నాం. ఈ ప్రెస్‌ రిలీజ్‌ చూసిన తరువాత టీడీపీ నాయకులకు కంటి శుక్లాలు అయినా వచ్చి ఉండాలి. లేదా ఇంగ్లీష్‌ భాష అర్థం కాకపోయి ఉండాలి. యనమల రామకృష్ణుడు ఆయన సెల్ప్‌ సర్టిఫైడ్‌ వ్యక్తి. ఆయనకు పంటి నొప్పితో పాటు కంటి చూపు కూడా మందగించినట్లుగా ఉంది. సీఎం వైయస్‌ జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి..వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం కింద యనమల రామకృష్ణుడి కంటికి వైద్యం చేయించి వాస్తవాలు చూపించాలి. క్లియర్‌గా హెడ్డింగ్‌ పెట్టి ఐటీ శాఖ రూ.2 వేల కోట్లు అంటూ నేరారోపణ చేసింది. టీడీపీ నేతలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ఈ ప్రెస్‌నోట్‌ వైయస్‌ఆర్‌సీపీ విడుదల చేసింది కాదు. ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ నోట్‌ విడుదల చేసింది. కనీసం రూ.2 కోట్ల టర్నోవర్‌ లేని కంపెనీల ద్వారా డబ్బును బదాలాయింపులు చేశారు. విదేశాలకు పంపించి మళ్లీ తెప్పించుకున్నారు. కొన్ని కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా డబ్బులు బదలాయించారు. ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. తిరిగి వైయస్‌ఆర్‌సీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇది కేవలం కల్పితం అనుకుంటే ఐటీ శాఖపై కేసు వేయాలే కానీ, మాపై దాడి ఎందుకు?. గత ఎనిమిది సంవత్సరాలుగా వైయస్‌ జగన్‌పై అనేక తప్పుడు కేసులు పెట్టారు. లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఇంటిపై నేరుగా హెలికాప్టర్‌ దిగుతుందని, బెంగుళూరులో భవనం ఉందని, అందులో 600 మంది సెక్కూరిటీలు ఉంటారని, ఎవరో లక్షల కోట్లు ట్యాక్స్‌ కడితే..దాన్ని కూడా వైయస్‌ జగన్‌ కట్టారని ఎన్నో రకాలుగా తప్పుడు ప్రచారం చేశారు.  కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా సీబీడీటీ, ఐటీపై స్పందించకుండా మాపై ఆరోపణలు ఎందుకు.దమ్ము,ధైర్యం ఉంటే ఐటీ అధికారులపై డిఫర్మెషన్‌ వేయండి.

బాబు ఎందుకు స్పందించడం లేదు...
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను ఏపీలో అడుగుపెట్టనివ్వమని మాట్లాడారు. సీబీఐ, ఐటీ,ఈడీని రాష్ట్రంలోకి రానివ్వని టీడీపీ నేతలు ఈ రోజు ఐటీ దాడులు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు. తుమ్మినా, దగ్గినా మీడియా సమావేశం ఏర్పాటు చేసే చంద్రబాబు..ఈ నాలుగు రోజులుగా ఎందుకు మీడియా ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకు అవినీతి ఆరోపణలపై స్పందించడం లేదు. అర్ధరాత్రులు మీడియా సమావేశాలు పెట్టిన సందర్భాలు లేవా? అసలు చంద్రబాబు బతికేదే ప్రచారం మీద కదా? అలాంటి చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదు. రాత్రికి రాత్రి హైదరాబాద్‌కు వెళ్లిన చంద్రబాబు లెక్కలు చూసుకుంటున్నారు. చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రుడు ఈ ఐటీ దాడులపై ఎందుకు స్పందించడం లేదు. ఎక్కడ మీ బినామీలైన పత్తిపాటి పుల్లారావు, దేవినేని, గల్ల జయదేవ్‌, యరపతినేని చిక్కిపోతారో అని చంద్రబాబు భయపడుతున్నారు. ఇది కేవలం గోరంతే..కొండత అవినీతి చేశాననే భయంతో చంద్రబాబు చలి,జ్వరంతో ఇంట్లో ఉంటున్నారు. కేవలం పీఏ వద్ద రూ.2 వేల కోట్ల అవినీతి జరిగితే..ఇక చంద్రబాబు ఎంత అవినీతికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అచ్చెన్నాయుడికి చంద్రబాబుపై కోపం ఉన్నట్లు ఉంది. అందుకేనేమో మా నాయకుడు చంద్రబాబు తిరుమల కొండ ఎక్కుతాడు..మీరు ఎక్కుతారా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబు కొండెక్కితే ఎక్కడికి పోతాడో ఆయనకు తెలుసు. ఈ వయసులో స్పీడ్‌గా కొండ ఎక్కితే ఏమవుతుందో చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే అచ్చెన్నాయుడు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.

 

హిస్టరీ ఈజ్‌ గోయింట్‌ టూ రిపిట్‌

ఇప్పుడున్న టీడీపీలోని రెండో శ్రేణి నాయకులు చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి ఆ పదవిలో కూర్చోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఈ విషయాలను గ్రహించండి. హిస్టరీ ఈజ్‌ గోయింట్‌ టూ రిపిట్‌ అనే దోరణిలో నీతో ఉన్న నీ సహచర నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలను చంద్రబాబు గుర్తించాలి. చివరిగా చంద్రబాబుకు ఒక సవాల్‌ విసురుతున్నాం. రూ.2 వేల కోట్లకు సంబంధించి టీడీపీకి ఐటీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఐటీ శాఖపై పరువునష్టం దావా వేసే ధైర్యం ఉందా?. లేదు అనుకుంటే..చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించిన ప్రతి పైసా ఆయన నీతిగా సంపాదించాడని, చంద్రబాబు ఆస్తులపై మేం సీబీఐ విచారణకు సిద్ధమని టీడీపీ నేతలు ఇవాళ సాయంత్రంలోగా చెప్పమనండి. చంద్రబాబు సంపాదనపై, ఆస్తులపై సీబీఐ విచారణకు టీడీపీ సిద్ధమా?. ఒక పక్క దొంగ దొరికిపోయి ఎక్కడ దాక్కోవాలో తెలియక, ప్రజల ముందుకు రాలేక, మీడియా ముందు స్పందించడం లేదు. పక్కన చెంచాలను, ఎల్లో గ్యాంగ్‌ను పెట్టుకొని  ఈ రోజు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. మా నాయకుల మాటలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా మీ మేనేజ్‌మెంట్‌లో భాగమని ఏపీ ప్రజలు చూస్తున్నారు. ఓటుకు నోటు కేసు సమయంలో కూడా సెక్షన్‌-8 అన్నారు. కాపులకు సంబంధించిన రిజర్వేషన్లపై కేబినెట్‌ సమావేశం పెట్టి ఆ అంశాన్ని పక్కదారి పట్టించారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో, వ్యక్తిగత జీవితంలో, నాయకత్వం వహిస్తున్న సందర్భాల్లో ఎక్కడా కూడా నీతి, నిజాయితీగా ముందుకు వెళ్లింది లేదు. పోలవరం వద్దకు వెళ్లి జయం జయం చంద్రన్న అని పాటలు పాడించారు. ఇక జైలు జైలు చంద్రన్న అని పాడుకోవాల్సిందే. ఇదొక్క సందర్భమే కాదు గతంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. 

మాకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్థాపించిన నాటి నుంచి ఉప ఎన్నికలు, 2014, 2019 ఎన్నికల్లో మేం ఎవరితో పొత్తు పెట్టుకున్నామో రాష్ట్ర ప్రజలకు తెలుసు. మోస్టు క్రిడిబుల్‌ పార్టీ దేశంలోనే మొట్ట మొదటి స్థానంలో వైయస్ఆర్‌సీపీ మాత్రమే. ఏ రోజు పొత్తుల కోసం వెంపర్లాడలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు.  ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. 
 

తాజా వీడియోలు

Back to Top