అప్పుడెందుకు ఫ్యాక్టరీ మూసేయలేదు బాబూ..?

చంద్రబాబు నిర్లక్ష్యమని ఇప్పటి ప్రమాదానికి కారణం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీలో 1998లో అగ్రి ప్రమాదం జరిగిందని, మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఫ్యాక్టరీని ఎందుకు మూసివేయలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. చంద్రబాబు అర్థంపర్ధం లేని విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖలో ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ వద్ద సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో ప్రమాదాల సమయంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలా స్పందించారో అందరికీ తెలుసన్నారు. హెచ్‌పీసీఎల్‌లో ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీని తరలించాల్సింది కదా అని ప్రశ్నించారు. సింహాచలం భూములను డీనోటిఫై చేసి మరీ ఎల్జీ పాలిమర్స్‌కు అప్పగించింది  బాబు హయాంలో కాదా..? అని ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా వీటికి ఎలా అనుమతిలిచ్చారని చంద్రబాబును నిలదీశారు. 

చంద్రబాబు నిర్లక్ష్యమే ఇప్పటి ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఏం చేసినా అది న్యాయం.. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏం చేసినా అన్యాయం అవుతుందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల శ్రేయస్సే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 
 

Back to Top