కానిస్టేబుల్‌ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట 

పుట్టపర్తి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను సకాలంలో ఆస్పత్రికి చేర్చి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా.. తన సొంత పనిపై శనివారం రాత్రి అనంతపురానికి బయలుదేరిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి... జిల్లా కేంద్రానికి చేరువవుతుండగా రోడ్డు పక్కనే రక్తం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించారు.

వెంటనే తన వాహనాన్ని ఆపి పరిశీలించగా క్షతగాత్రుడు చెన్నేకొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ మురళీగా గుర్తించారు. బైక్‌పై వెళుతూ అదుపు తప్పి కిందపడినట్లుగా తెలుసుకున్న ఆయన వెంటనే క్షతగాత్రుడిని తన వాహనంలో అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు.

తాజా వీడియోలు

Back to Top