మహిళ సంఘాల అభ్యున్నతికి కృషి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం మహిళ సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గల 45648 మహిళ సంఘ సభ్యులకు రెండో విడత వైయస్ఆర్ ఆసరా పథకం వర్తింపజేశారు. ఈ మేరకు పెద్దపాడు క్యాంప్ కార్యాలయంలో గురువారం రూ. 30,99,14,944 విలువ గల చెక్కును మహిళ సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని తెలిపారు. మహిళ సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. టీడీపీ హయాంలో మహిళ సంఘాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళ సంఘాలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను దశలవారీగా చెల్లిస్తున్నారని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top