“అభివృద్ధి"ని గెలిపించండి 

వినుకొండ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 

గుంటి ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. 

బ్రహ్మరధం పట్టిన ప్రజలు.. 

వినుకొండ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధికి ఓటు వేయాల‌ని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్ర‌హ్మ‌నాయుడు విజ్ఞ‌ప్తి చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఐదేళ్ల‌లో వినుకొండ నియోజవకవర్గాన్ని
అభివృద్ధిబాట పట్టించాను... మరింతగా వినుకొండను అభివృద్ధి చేసుకొనేందుకు మరోమారు తనను ఎమ్మెల్యేగా
గెలిపించేందుకు అభివృద్ధికి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.  శ‌నివారం పట్టణంలోని గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో తొలుత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో  ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 28వ వార్డులో ప‌ర్య‌టించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. వినుకొండ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా గత ఐదేళ్ళు పనిచేశానని, పట్టణంలోని ఎన్ఎస్పి కెనాల్ రోడ్డు నిర్మాణం, స్టేడియం నిర్మాణం, కొండపై ఘాట్ రోడ్డు, సింగర చెరువు అభివృద్ధి, తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు, నూతన పాఠశాల భవన నిర్మాణాలు వంటివి చేపట్టి వినుకొండను అభివృద్ధి బాట పట్టించానని, రానున్న రోజుల్లో వినుకొండను మరింతగా అభివృద్ధి చేసుకోవాలంటే మరోమారు తనకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. 

2019 ఎన్నికల నాటికి కేవలం తాను వైయ‌స్ఆర్‌ సీపీ నాయకుడిగా బరిలో నిలిచానని, ప్రత్యర్థుల వైఫల్యం వలన నేను అభివృద్ధి చేస్తాను అనే నమ్మకంతో తనకు 29వేల మెజార్టీ వచ్చిందని, అయితే 2024 ఎన్నికల నాటికి తాను ఎమ్మెల్యేగా వినుకొండను అభివృద్ధి చేసి ఎన్నికలకు వెళుతున్నానని, ఈ ఎన్నికల్లో 40వేల ఓట్లు మెజార్టీ వస్తుందని, ఆ దిశగా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్షాలు పొత్తులు, ప్యాకేజీలు, కేంద్ర ప్రభుత్వ అండదండలను నమ్ముకుంటే వైయ‌స్ఆర్‌సీపీ కేవలం దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకుందని తెలిపారు. 

ప్రజల ఆశీస్సులు ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా అనీల్ కుమార్ యాదవ్‌కు ఉంటాయ‌ని, ఇరువురికీ ఫ్యాను గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..

వినుకొండలో గెలవాలనే తపనతో ప్రతిపక్ష పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు మోసపోతే ఊరికి, బజారుకో రౌడీ, గూండాలు పాలన చేసే రోజులు వ‌స్తాయ‌ని, గతంలో జరిగిన సంఘటనలు మరిచిపోవద్దని హితవు పలికారు. ప్రజలు, వ్యాపారులు, సామాన్యులు ప్రశాంత జీవనం గడపాలంటే వారి ఆస్థులు, ప్రాణ మానాలకు రక్షణ కల్పించేలా భరోసా కల్పించేందుకు వైయ‌స్ఆర్‌సీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న నవరత్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తనకు, ఎంపీ గా అనిల్‌కు అండగా నిలవాలని, లబ్ధిదారులే ప్రచార కర్తలుగా కదలి రావాలని కోరారు. 

మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాత్రమేనని కొనియాడారు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు మోడీని తిట్టి, నేడు పదవుల కోసం మళ్లీ పొగుడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.  బీజేపీ - టీడీపీ - జనసేన పార్టీలు పొత్తు ప్రజల కోసం కాదని పదవుల కోసం మాత్రమేనని ప్రజలకు తెలుసన్నారు. రానున్న ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ 175 స్థానాల్లో విజయం సాధింస్తుందని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు.  కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని ఆయన భరోసానిచ్చారు. ప్ర‌చారంలో భాగంగా త‌మ వీధుల్లోకి వ‌చ్చిన ఎమ్మెల్యే బ్ర‌హ్మ‌నాయుడికి స్థానికులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. త‌మ ఓటు ఫ్యాన్ గుర్తుకే అని నిన‌దించారు.

Back to Top