వైయ‌స్ జ‌గ‌న్ న‌వ‌యుగ‌ అంబేద్క‌ర్  

ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి 
 

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వ‌యుగ అంబేద్క‌ర్ అని గిరిజ‌న ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మీ అభివర్ణించారు. ఈరోజు భార‌త‌దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా నామినేటెడ్ ప‌ద‌వులు, కాంట్రాక్టు ప‌నుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఇంకా మైనారిటీల‌కు మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డం అనే గొప్ప నిర్ణ‌యం తీసుకున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారికి ధ‌న్య‌వాదాలు అని చెప్పారు భాగ్య‌లక్ష్మి. ఇది సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం, ఇందుకు మ‌హిళ‌లంద‌రి త‌ర‌ఫునా ముఖ్య‌మంత్రి గారికి మా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఒక వ్య‌క్తికి, ఒక కులానికీ 10శాతానికంటే ఎక్కువ వ‌ర్కులు ఇచ్చారు. మిజోరం, మేఘాల‌యా, నాగాలాండ్ వంటి 90 శాతం ఎస్సీ, ఎస్టీ జ‌నాభా ఉన్న రాష్ట్రాల్లోనే వారికి 50 శాతం నామినేటెడ్ ప‌ద‌వులు, కాంట్రాక్టు ప‌నులు ఇచ్చే చ‌ట్టం ఏదీ లేదు. చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌రైన న్యాయం జ‌రిగితేనే సామాజిక న్యాయం జ‌రుగుతుంద‌ని బాబాసాహెబ్ అంబేద్క‌ర్ అన్నారు. పాద‌యాత్ర స‌మ‌యంలో మా స‌మ‌స్య‌లు తెలుసుకున్న వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఆచ‌ర‌ణ‌లో మాకోసం రిజ‌ర్వేష‌న్లు అందించ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాం అన్నారు భాగ్య‌ల‌క్ష్మి. నేడు వైఎస్ జ‌గ‌న్ ని చూస్తే మాకు న‌వ‌యుగానికి అంబేద్క‌ర్ లా, అల్లూరి సీతారామ‌రాజులా క‌నిపిస్తున్నారని చెప్పారు. డ్వాక్రా సంఘాల‌ను గ‌త ప్ర‌భుత్వం మోసం చేసింది. బంగారం విడిపించి ఇస్తాన‌న్న‌ది. వీటిలో ఏదీ జ‌ర‌గ‌లేదు. చివ‌ర‌కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల‌కు రావాల్సిన ఉద్యోగాలు రాకుండా కాంట్రాక్టు ఉద్యోగాల‌తో ఉసురు తీసింది. నేటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డిగారి హ‌యాంలో ల‌క్ష‌ల ఉద్యోగాల‌తో నిరుద్యోగుల‌కు ఊర‌ట క‌లిగిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియ‌జేసారు. 
 

Back to Top