జ్యుడీషియల్‌ క్యాపిటల్‌తో రాయలసీమకు న్యాయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
 

అనంతపురం: రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మూడు రాజధానులు రావాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయడం హర్షణీయమని, సీఎం ప్రతిపాదనను ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. కర్నూలులో హైకోర్టుతో రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ఆరోపణలు అర్థరహితమన్నారు. అమరావతిలో చంద్రబాబు బినామీలు, టీడీపీ నాయకులు భూములు కొన్నారని, బినామీల కోసం, టీడీపీ నేతల భూముల కోసం చంద్రబాబు రాజధానులపై అర్థపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

 

Back to Top