స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లోకేష్‌ నేర్చుకోవాలి

అవినీతిపై ఆధారాలతోనే అరెస్టులు

టీడీపీపై కక్షసాధించాల్సిన అవసరం లేదు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

 

తాడేపల్లి: స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లోకేష్‌ నేర్చుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి తావులేకుండా పరిపాలన అందిస్తున్నారని చెప్పారు.అవినీతిపై ఆధారాలతోనే అరెస్టులు చేశామన్నారు. టీడీపీపై కక్షసాధించాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలాగానే టీడీపీ పరిస్థితి దిగజారిందని విమర్శించారు.  చంద్రబాబు కుమారుడు కాబట్టి దొడ్డిదారిన కౌన్సిల్‌లోకి లోకేష్‌ను తీసుకువచ్చారన్నారు.  ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో లోకేష్‌ తుక్కు తుక్కుగా ఓడిపోయారన్నారు. 151 సీట్లు గెలుచుకున్న సీఎం వైయస్‌ జగన్‌ను దగ్గర్నుంచి కూడా చూసే పరిస్థితి లేదన్నారు. వడ్డీతో సహా చెల్లించడానికి ఇదేమన్నా హెరిటేజ్‌ సంస్థా అని ప్రశ్నించారు. లోకేష్‌ నాయకుడిగా తయారయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు.  జేసీ బ్రదర్స్‌ అక్రమాలు చంద్రబాబు, లోకేష్‌లకు కనిపించడం లేదా అని అంబటి ప్రశ్నించారు.  అక్రమ కట్టడంలో నివసిస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు ఇతరులను విమర్శించే హక్కు లేదన్నారు.  ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అంబటి రాంబాబు విమర్శించారు.
 

Back to Top