ప్రత్యర్థి పార్టీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు యోచన చేశారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

చంద్రబాబు ఎవరి కోసం పెగాసస్‌ కొన్నారో తేల్చాలి

పెగాసస్‌ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలు బయటకు తేవాలి

అమరావతి:  ప్రత్యర్థి పార్టీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు యోచన చేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీపై కక్ష్యతోనే చంద్రబాబు ఇదంతా చేశారని మండిపడ్డారు. నేరుగా రాజకీయాలు చేసిన సందర్భం చంద్రబాబులో లేదన్నారు. కుట్రలు, కుతంత్రాల ద్వారానే అధికారం పొందాలనే చంద్రబాబు ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబుపై సీఎం మమత ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దుర్మార్గమైన రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పెగాసస్‌పై అసెంబ్లీలో జ‌రిగిన‌ చర్చలో అంబ‌టి రాంబాబు మాట్లాడారు. 

 పెగాసస్‌ వ్యవహారంపై ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని  ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హయాంలో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించారని బెంగాల్‌ అసెంబ్లీలో సీఎం మమత తెలిపారన్నారు. పెగాసస్‌ వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారన్నారు. వాస్తవాలు లేకుండా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించరు కదా? అని అన్నారు. పెగాసస్‌ స్పైవేర్‌ అంశంపై విచారణ జరగాలని తెలిపారు. విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

చంద్రబాబుకు తెలిసింది కుట్రలు, కుతంత్రాలేనని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర చేశారని అన్నారు. చంద్రబాబు హయాంలోని ఓ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పోలీసు అధికారిలా పని చేయలేదని పేర్కొన్నారు. పచ్చచొక్కా వేసుకున్న టీడీపీ నేతలా వ్యవహరించారని తెలిపారు. పెగాసస్‌ను ప్రత్యర్థి రాజకీయ నేతలపై ఉపయోగించారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలందరీ ఫోన్లను ట్యాప్‌ చేశారని ఆరోపించారు. సహచరులైన బీజేపీ నేతలపైనా కూడా పెగాసన్‌ ఉపయోగించారని తెలిపారు. చంద్రబాబు ఎవరికోసం పెగాసస్‌ కొన్నారో తేల్చాలని అన్నారు.

 ప్రజా సమస్యలు చర్చించకుండా అసెంబ్లీ నుంచి చంద్రబాబు పారిపోయారన్నారు. సస్పెండ్‌ చేయమని అడగడానికే టీడీపీ సభ్యులు సభకు వస్తారని తెలిపారు. సస్పెండ్‌ కాగానే సభ నుంచి బయటకు వెళ్లిపోవడం టీడీపీ సభ్యులకు అలవాటని విమర్శించారు. అనైతికంగా, అప్రజాస్వామికంగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పెగాసస్‌ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలు బయటకు తేవాలని అంబటి రాంబాబు కోరారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రపంచానికి తెలియాలని అంబ‌టి రాంబాబు కోరారు.

 

 

Back to Top