భూ తగాదాలు లేని గ్రామాలు ఉండాలి అన్నదే జగనన్న ల‌క్ష్యం 

ఎమ్మెల్యే అలజంగి జోగారావు 

పార్వ‌తీపురం: భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు ఉండాల‌న్నదే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని, అందుకే జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హక్కు, భూ రక్షా పథకాన్ని అమ‌లు చేస్తున్నార‌ని ఎమ్మెల్యే  అలజంగి జోగారావు అన్నారు.  ఏంఅర్ నగరం గ్రామ రెవిన్యూ పరిధిలో  రైతన్నలకు పాస్ పుస్తకాలు పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జోగారావు మాట్లాడుతూ.. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని  అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్  సారధ్యంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్విత భూహక్కు, భూ పదకం "మీ భూమి - మా హామీ" అనే రీ సర్వే బృహత్తర కార్యక్రమం ద్వారా 100 ఏళ్ల తరువాత రాష్ట్రంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం అని  అలజంగి జోగారావు తెలిపారు. 

మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని మూడు దశల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది అని, మొదటి దశలో 5,300, రెండో దశలో 5,700, మూడో దశలో 6,460 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోంది అని ప్రజలకు తెలిపారు. మన గ్రామంలో ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా మంది రైతులు తమ భూమి ఆన్లైన్ కాక రైతు భరోసా పథకంతో పాటు ఈ క్రాప్ చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకు రావడం జరిగింది అని వాటి అన్నిటికి వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్విత భూహక్కు మరియు భూ పదకం ద్వారా పరిష్కారం లభించడం జరిగింది అని ఈరోజు మీ ముంగిటకు విచ్చేసి మరీ మీకు మీ భూ హక్కు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని అని కావున మీరంతా మన ప్రభుత్వంపై కృతజ్ఞతగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ గారిని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరడం జరిగినది.  కార్యక్రమంలో మండల ఏం అర్ ఓ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, ఏఏంసి చైర్ పర్సన్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, వైస్ సర్పంచ్, రెవిన్యూ అధికారులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, గ్రామ రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top