బినామీల భూమి కోసమేనా చంద్రబాబు పోరాటం? 

ఒక్క అమరావతిలోనే నవ నగరాలు రావాలన్న ఆలోచనకు ప్రజలు బుద్ధి చెప్పారు

ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన

ఐదేళ్లలో అభివృద్ధి కోసం ఎన్నడూ బాబు జోలె పట్టలేదు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

విశాఖ: చంద్రబాబు స్వలాభం కోసమే కొంత మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యక్తులను వెంట పెట్టుకొని ఉద్యమం చేస్తున్నారని, ఆయన ఉద్యమం బినామీ పేర్లతో భూములు కొన్న వారి కోసమే అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజు విమర్శించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద తప్పు  ఇవాళ అమరావతిలో జరిగిపోతుందనే ఓ గందరగోల పరిస్థితిని సృష్టిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాజధానిని తరలిస్తున్నామని ఎవరు చెప్పారో అర్థం కావడం లేదు. ఎవరూ చెప్పలేదే. మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఇవాళ మూడు రాజధానులను ప్రతిపాదించారే తప్ప..అమరావతిని అక్కడి నుంచి తీసేస్తున్నట్లు ఏనాడు చెప్పలేదు. దేనికోసం మీరు పోరాటం చేస్తున్నారు? రైతులు అనేవారు పోలాలకు నీరు కావాలని పోరాటం చేస్తారు. ఇవాళ 29 గ్రామాల్లో కొంతమందిని ముందుపెట్టి చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మీ బినామీల పేర్లతో కొన్న భూముల కోసమా మీ పోరాటం? సుమారుగా లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబే చెప్పారు. మీ బినామీలకు కట్టబెట్టేందుకే ఆయన తాపత్రయం. ఒక్క అమరావతిలోనే అన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేస్తే ..ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో చూశాం. మీరు చేసిన తప్పును సరిదిద్దేందుకు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులను ప్రతిపాదిస్తే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఆయన పోరాటంలో పాల్గొనేది ఎవరో అందరూ చూస్తున్నారు. ఢిల్లీ నుంచి కొమ్ము కాస్తున్న కొందరు వ్యక్తులు, కొన్ని అనుకూల మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టి గందరగోలం సృష్టిస్తున్నారు. సొంత లాభం కోసం అమాయకులను చంద్రబాబు బలి చేస్తున్నారు. మొన్న తమిళనాడులో ఓ వ్యక్తి మనస్థాపానికి గురై కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే..ఆ వీడియోను కట్‌, కాపీ, పేస్టు చేసి ఇవాళ టీడీపీ సోషల్‌ మీడియాలో రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని , ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేశారు. ఇవాళ జరగనిదాన్ని జరిగినట్లు సృష్టించి, ప్రజలను మభ్యపెట్టాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకు వచ్చింది. మొన్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కారును అడ్డుకొని దాడి చేశారు. ఆ దాడిలో పాల్గొన్న వ్యక్తులు రాజధాని ప్రాంతానికి చెందిన వారు కాదే?. విద్యార్థుల భవిష్యత్తును చంద్రబాబు ఎందుకు పాడు చేస్తున్నారు. రైతు ఎప్పుడైనా నాగలి పడుతారే కానీ..ఆయుధం పట్టరు.శాంతియుతంగా ధర్నాలు చేసే వారికి రాళ్లు, కర్రలు ఎలా వస్తాయి. ఒక్క గజం భూమి నా వద్ద నుంచి తీసుకున్న ఒప్పుకొను, ప్రాణాలు అర్పిస్తామని నిజమైన రైతులు అంటారు. నీ భూమి నీకు తిరిగి ఇస్తానంటే చనిపోతామనే వ్యక్తులు నిజంగా రైతులేనా? చంద్రబాబు దేనికోసం భిక్షాటన చేస్తున్నారు. మీ ఫెయిడ్‌ ఆర్టీస్టులకు ఫెవ్‌మెంట్‌ ఇచ్చేందుకేనా బిక్షాటన. చంద్రబాబు సతీమణి ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఏమి దానం చేశారు. గోదావరి పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలకు ముక్కు పుడుక ఇవ్వని భువనేశ్వరి ఇవాళ గాజులు దానం చేస్తున్నారంటే బినామీల కోసమే కదా? . ఇవాళ నాలుగు ఇడ్లీషాపులు, జిరాక్స్‌ షాపులు తరలిస్తే..టీడీపీ నేతలకు వచ్చే నొప్పేంటి?. వెలగపూడి వద్ద ఉన్న సెక్రటేరియట్‌ వద్దకు వెళ్లాలంటే సామాన్యులు ఎవరైనా వెళ్లవచ్చు. అక్కడికి వెళ్లాలంటే కారు కావాలి. ఇలాంటి తరుణంలో సీఎం వైయస్‌ జగన్‌ అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు. దాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలి. చంద్రబాబును ఇవాళ రాయలసీమలో ప్రజలు అడ్డుకుంటున్నారో చూశాం. ఆయనకు దమ్ముంటే ఉత్తరాంధ్రలో పర్యటించమనండి. అడ్డుకుంటామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top