విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు

ఎమ్మెల్యే ఆది మూలం 

 తిరుపతి  :  సీఎం వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి విద్యా వ్య‌వ‌స్థ‌లో వినూత్న మార్పులు తీసుకువ‌చ్చార‌ని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు.  పిచ్చాటూరు మండల కేంద్రంలోని జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి 284 మంది విద్యార్థిని విద్యార్థులకు, టీచ‌ర్ల‌కు ఉచితంగా ట్యాబ్‌లు ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ... ఒక్కొక్క ట్యాబ్ రూ. 16,500 కు పైగా మార్కెట్‌ విలువ కలిగినవి అని, దాదాపు రూ.15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి సుమారు రూ. 32 వేల లబ్ధి చేకూరుతుందని అన్నారు. ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌, 3 ఏళ్ళ పాటు వ్యారంటీ ఉంటుందని పేద విద్యార్ధులను మెరుగ్గా తీర్చిదిద్దేలా, డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్ధమయ్యేలా మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతిలోకి అడుగుపెట్టిన తరువాత ప్రతి విద్యార్ధికి ఇకపై ప్రతి ఏటా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ కి ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పై పెద్దగా దృష్టి సారించలేదని, మధ్యాహ్న భోజనం, విద్యా వసతులు, భవనాలు, టాయిలెట్లు బాగుండేవి కాదని నేడు మన రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నర ఏళ్ళలో జగనన్న అమ్మ ఒడి పథకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, 8వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులకు పంపిణీ చేస్తున్న ట్యాబ్‌ లు, బైజుస్‌ కంటెంట్‌, జగనన్న గోరుముద్ద, పాఠశాలల్లో నాడు నేడు, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, స్వేచ్ఛ (శానిటరీ నాప్‌కిన్స్‌) పథకాలు ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్‌ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను ప్రభుత్వం సన్నద్ధం చేస్తున్నదని ఇది గొప్ప శుభ పరిణామం అని అన్నారు. పేద విద్యార్ధులకు సైతం డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెస్తూ, తరగతి గదుల్లో చెప్పే పాఠాలను ఇళ్ళకు వెళ్ళాక కూడా పిల్లలు మరింత క్షుణ్ణంగా నేర్చుకునేందుకు వీలుగా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ ఇంటర్నెట్‌ సౌకర్యం లేని విద్యార్ధులకు ఆఫ్‌ లైన్‌లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 పాఠ్యాంశాలు అందుబాటులో ఉండేలా, 8,9 తరగతుల కంటెంట్‌ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్‌ బైజూస్‌ ప్రీమియం యాప్‌ ద్వారా విద్యార్ధులకు మాథ్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హిస్టరీ, జియాలజీ, సివిక్స్‌ సబ్జెక్ట్‌లలో అభ్యసన సులువుగా ఉండేలా ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో ఉచిత ఈ కంటెంట్‌ ప్రతి చాప్టర్‌ను కాన్సెప్ట్‌లుగా విభజించి 67 చాప్టర్లు, 472 కాన్సెప్ట్‌లపై 300 వీడియోలు, 168 సాల్వ్‌డ్‌ క్వశ్చన్‌ బ్యాంక్‌లు అందుబాటులో ఉంటాయని అన్నారు.పిల్లలకు సులభంగా పాఠ్యాంశాలు అర్ధమయ్యేలా టెక్ట్స్‌ రూపంలో మాత్రమే కాకుండా మంచి చిత్రాలు, వీడియో, ఆడియో, త్రీ డైమెన్షన్‌ (త్రీడీ) ఫార్ములాలో యానిమేషన్లతో రూపొందించిన కంటెంట్‌ తో కూడినదని, పిల్లలు తమ స్ధాయిని స్వయంగా అంచనా వేసుకునేలా అసెస్‌మెంట్‌ విధానం, ప్రతి చాప్టర్‌ తర్వాత 40-50 ప్రశ్నలు, వివిధ గ్రేడ్లలో మాక్‌ పరీక్షలు బాగా దోహద పడుతుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు విద్యార్థులకు ట్యాబ్స్‌ ను పంపిణీ చేశారు. తర్వాత ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో కొత్తగా మంజూరైన 78 లక్ష రూపాయలతో బాత్రూములు టాయిలెట్స్‌ నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు 

Back to Top