అప్పులపై దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

లబ్ధిదారులకు డీబీటీ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి

స్టార్టప్‌ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతున్నారు

రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషి

అమరావతి: అప్పులపై దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై చర్చలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో వైయస్‌ జగన్‌  ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధాలుగా భావించి బటన్‌ నొక్కి మరి డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీ అప్పులపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. గతంలో దోచుకో, పంచుకో, తినుకో పథకం ఉండేది. 

రాష్ట్ర విభజన నాటికి రూ.1.26 లక్షల కోట్లు అప్పు ఉండేది. ఆ అప్పు రూ.2.45 కోట్లకు చంద్రబాబు చేశారు. మేం రూ.8 లక్షల కోట్లు చేశామని ప్రతిపక్ష ఆరోపణలు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.100 కోట్లు మాత్రమే ఉందని యనమల రామకృష్ణుడు అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది మార్చి నాటికి కేవలం  రూ.3,82,165 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉంది. మనం కేవలం రూ.1.15 కోట్లు మాత్రమే అప్పు చేశాం. ప్రజలకు అందించింది రూ. 1.25 లక్షల కోట్లు నేరుగా అందించాం. 
దేశంలో మనమే అత్యధికంగా అప్పులు చేస్తున్నామని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఏ రాష్ట్రమైనా అప్పులుచేయడం సహజం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులపై ఇటీవల పార ్లమెంట్‌లో  హిమాచల్‌ ప్రదేశ్‌ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీ మొత్తం అప్పులు మార్చి నాటికి రూ.3,98,909 కోట్లు అని తేల్చారు. చంద్రబాబు దిగిపోయేనాటికి రూ.2,68115 కోట్లు అప్పలు ఉండేవని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వివరించారు. 

దుష్ట చతుష్టయం ప్రతి విషయంలో కూడా దొంగ లెక్కలు చెబుతోంది. దేశంలో అప్పుల్లో మన రాష్ట్రం 8వ స్థానంలో ఉందని కేంద్రమే స్పష్టం చేసింది. ఎల్లోమీడియా ప్రచారం చాలా ఘోరంగా ఉంది. టీడీపీ హయాంలో అనవసర అప్పులు చేశారు. బడ్జెట్‌కు మించి అప్పులు చేశారు. ఒక సింగిల్‌ డే రోజు రూ.5 వేల కోట్లు ఆర్‌బీఐ నుంచి డ్రా చేశారు. పసుపు కుంకుమకు పంచి పెట్టారు. ఒక్క రోజులో ఇంత డబ్బు పంపిణీ చేసింది ఎప్పుడు చూడలేదు. 

మన సీఎం వైయస్‌ జగన్‌ మొన్న దావోస్‌ పర్యటనకు వెళ్లి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. దానిపై కూడా దుష్ట చతుష్టయం దుష్ప్రచారం చేశారు. ఏ విమానం ఎక్కారు..ఎక్కడ తిరిగారని డిబెట్లు పెట్టారు. దావోస్‌లో మన రాష్ట్రం ప్రజెంటేషన్‌ అద్భుతంగా ఇచ్చారు. రూ.1.20 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. గతంలో చంద్రబాబు 18 సార్లు దావోస్‌ వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చూశాం. 2019లో లోకేస్‌ కూడా వెళ్లారు. వీరంతా స్పిస్‌ బ్యాంకులో దాచుకునేందుకే వెళ్తున్నట్లుగా ఉండేది.

వైజాగ్‌ను అద్భుతమైన కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ పరిశ్రమలు మరిన్ని వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. స్టార్టర్స్‌ యూనికార్న్‌గా తయారవుతున్నాయి.  పప్పు బాబు మాత్రం యూనికార్న్‌ బైక్‌ కావాలని చంద్రబాబు అడిగినట్లు వింటున్నాం. ముఖ్యమంత్రి నిర్ణయంతో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. టెక్స్‌టైల్స్‌ పార్క్‌ రాకుండా రాత్రికి రాత్రి అడ్డుకున్నారు. కులం ప్రతిపాదికన దేన్ని నిర్మించలేరు. పగుళ్లు ఏర్పాడుతాయి. నిజమైన అభివృద్ధి పొందలేమని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పారని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గుర్తు చేశారు.  ఇదే సిద్ధాంతాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నమ్మే వ్యక్తి. అన్ని కులాలను సమానంగా చూస్తున్నారు. 

Back to Top