సీఎం వైయస్‌ జగన్‌ రైతు బాంధవుడు

వైయస్‌ఆర్‌ సీపీ పాలనలో రైతులకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది

మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాంధవుడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో రైతులకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తిరుపతిలో వారు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. టీడీపీ పాలనలోని బకాయిలను కూడా వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరిగిందని, పంటల బీమా కూడా టీడీపీ సర్కార్‌ చెల్లించలేదని గుర్తుచేశారు. 

రైతుకు పంట పెట్టుబడి సహాయం కింద వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే రెండు దఫాలు ఆర్థికసాయం అందించామన్నారు. రైతులకు కొండంత అండగా రైతు భరోసా కేంద్రాలు ఉంటున్నాయన్నారు. ఆర్బీకేల ద్వారా రైతు పంట వేసే సమయం నుంచి మార్కెట్‌లో అమ్ముకునే వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. రైతుకు ఎక్కడా నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 

Back to Top