తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ రైతులతో మంత్రుల బృందం భేటీ

షుగర్‌ ఫ్యాక్టరీల్లో స్థితిగతులను తెలుసుకున్న మంత్రులు

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలో రైతులతో మంత్రుల బృందం భేటీ అయ్యింది. మంత్రులు అవంతి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కన్నబాబు, బొత్స సత్యనారాయణ షుగర్‌ ఫ్యాక్టరీలపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. షుగర్‌ ఫ్యాక్టరీల్లో స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకోమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కమిటీ వేశారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. రైతుల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అందరికీ మేలు జరిగేలా సీఎం నిర్ణయం తీసుకుంటారని వివరించారు. 

రాష్ట్రంలో 12 షుగర్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రైతుల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులకు మేలు చేయాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ హయాంలోని రూ. 54 కోట్ల బకాయిలను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారని గుర్తుచేశారు.  
 

Back to Top