పరిహారం అందిస్తాం.. ఆందోళన చెందవద్దు

మంత్రులు కన్నబాబు, విశ్వరూప్‌

తూర్పుగోదావరి: అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందవద్దు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో నీటి మునిగిన పంటను మంత్రులు కన్నబాబు, విశ్వరూప్‌లు పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని రైతులకు భరోసానిచ్చారు. పంట నష్టంపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రకృతి విపత్తుల నిధి నుంచి రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తామన్నారు. 
 

Read Also:  ఇరిగేషన్‌ శాఖపై సీఎం సమీక్షా సమావేశం

Back to Top