ఉద్దానం బాధితులకు అండగా నిలిచింది వైయస్‌ జగనే  

మంత్రి విడుదల రజిని

గత ప్రభుత్వం ఉద్దానాన్ని ఏనాడూ పట్టించుకోలేదు

ఉద్దానంలో పరిస్థితిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది

తాడేపల్లి:  ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ బాధితులకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండగా నిలిచారని మంత్రి విడదల రజిని తెలిపారు. బాధితులు ప్రతి నెల రూ.10 వేలు పెన్షన్‌ అందిస్తున్నారని, ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని, ల్యాబ్స్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈనాడు పత్రిక కథనంలో వాస్తవం లేదని ఆమె ఖండించారు. బుధవారం మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఈనాడు పని చేస్తోంది. గత ప్రభుత్వం ఏనాడూ ఉద్దానాన్ని పట్టించుకోలేదు. చంద్రబాబును రామోజీరావు ఏ రోజూ ప్రశ్నించలేదు. ఉద్దానంలో పరిస్థితిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. ఇలాంటి నీతిమాలిన రాతలను జనం ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఉద్దానం సమస్య ఈనాటిది కాదు. ఉద్దానం ప్రాంతంలో మన ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. ఉద్దానం సమస్యపై సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. మార్చి 2023లో దీన్ని పూర్తి చేస్తాం. రూ.700 కోట్లతో ఫ్యూరీఫైడ్‌ డ్రికింగ్‌ వాటర్‌ ప్రాజెక్టును ఇప్పటికే 80 శాతం పూర్తి చేశాం. జనవరిలోగా దీన్ని పూర్తి చేస్తాం. తీవ్రంగా ఉన్న వారందరిని గుర్తించాం. వీరందరికి రెగ్యులర్‌గా డయాలసిస్‌ చేస్తున్నాం. ప్రతి నెల రూ.10 వేలు పింఛన్‌ కూడా ఇస్తున్నాం. థర్డ్, పోర్త్‌ స్టేజ్‌లో డిసీజ్‌ ఉన్న వారికి మన ప్రభుత్వం రూ.5 వేల పింఛన్‌ ఇస్తోంది. ఇవన్నీ మన ప్రభుత్వం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఎలక్షన్‌ స్టంట్‌గా ఏదో ఒక మాయ చేసినట్లుగా దీనిపై డ్రామాలు చేస్తున్నారు. పలాసలో మనం నిర్మిస్తున్న ఆసుపత్రి ద్వారా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన సేవలు అందించబోతున్నాం.  ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఆర్‌వో ప్లాంట్లు 142 ఆటోమెటెడ్‌ సురక్షిత మంచినీటిని అందిస్తున్నాం. చంద్రబాబు వీరికి కనీసం మంచినీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. మంచి చేస్తున్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై చంద్రబాబు, ఎల్లోమీడియా బురద జల్లుతోంది.

ప్రాథమిక దశలో వ్యాధి తీవ్రతను గుర్తించిన వారందరికీ 17 ల్యాబ్స్‌ను కూడా  మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే సెమీ ఆటో ఎనలైజర్‌ ద్వారా సీరం క్రియేటిన్, బ్లెడ్‌ లెవల్‌ పరీక్షలు చేస్తున్నాం.వీటి ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప్రాధమిక దశలోనే గుర్తించి వైద్యం అందించి వారి విలువైన జీవితాలను కాపాడే ప్రయత్నం మన జగనన్న ప్రభుత్వం చేస్తోంది. ఇవేవి కూడా చంద్రబాబుకు పట్టవు..ఆయన పట్టించుకోరు. ప్రజల్లో ఎప్పుడు ఒక నెగిటివ్‌ ఇంప్రెషన్‌ ఇచ్చేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తుంటారు. అక్షరాలు అమ్ముకొని ఒకరి స్వార్థం కోసం పని చేసే ఇలాంటి స్వార్థ రాజకీయాలు చేసే వారు మన సమాజానికి పట్టిన శని అని మంత్రి విడుదల రజిని విమర్శించారు. 

 

Back to Top