గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ

వైద్య సేవల గురించి ఆరా తీసిన మంత్రి విడదల రజిని

రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

గుంటూరు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని డాక్టర్లకు సూచించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి విడదల రజిని అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులతో మాట్లాడారు. ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మంచి వైద్యం అందుతుందా లేదా అనేది తెలుసుకునేందుకు తనిఖీ చేసినట్టు వివరించారు. నాడు–నేడుతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని, ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి విడదల రజిని డాక్టర్లకు సూచించారు.  మంత్రి వెంట ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు, ఇతర అధికారులు ఉన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top