అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిజస్వరూపం అందరికీ తెలిసిపోయిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26 కేసులున్నప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. 26 వేల కేసులున్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు రాజకీయ పార్టీతో చర్చించలేదని ప్రశ్నించారు. సోనియాను ఢీకొని సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని మంత్రి వేణుగోపాలకృష్ణ గుర్తుచేశారు. అచ్చెన్నాయుడు పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి 50 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లే లేరన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువయ్యారన్నారు.