జగన్‌ అన్న ముద్దు.. బాబు అసలే వద్దు..

న‌ర‌స‌రావుపేట బ‌హిరంగ స‌భ‌లో మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌

న‌ర‌స‌రావుపేట‌: ఒంగోలులో జరుగుతోంది మహానాడు కాదు.. ఏడుపునాడు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ఎద్దేవా చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలు ఏనాడూ హక్కులు కోరలేదని, ఎందుకంటే అన్నింటినీ ముఖ్యమంత్రి అందించారన్నారు. న‌ర‌స‌రావుపేట బ‌హిరంగ స‌భ‌లో మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ.. మంత్రి పదవులు మొదలు, అన్ని రాజకీయ పదువులు, నామినేటెడ్‌ పదవుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చార‌ని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం పదవులు, మండలి పదవుల్లోనూ వారికి ఎంతో ప్రాధాన్యం క‌ల్పించార‌న్నారు. అన్ని వర్గాల ఆదరణ పొందిన సీఎం వైయ‌స్‌ జగన్‌ని చూసి భయపడుతున్న చంద్రబాబు, జనసేనతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే ‘జగన్‌ అన్న ముద్దు.. బాబు అసలే వద్దు’.. ఇదీ మన నినాదం కావాలని పిలుపునిచ్చారు. 

Back to Top