త్వరలో చంద్రబాబుకు  చిప్పకూడు ఖాయం 

మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

విజ‌య‌వాడ‌:  త్వరలో ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబుకు  చిప్పకూడు ఖాయమని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని..చంద్రబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పాల డెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని... సంగం డైరీ ఎవడబ్బ సొత్తు అని ధూళిపాళ్ళ తన జేబు సంస్థగా మార్చుకున్నాడని నిప్పులు చెరిగారు. అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల రక్తం తాగిన దుర్మార్గులు గత టిడిపి నాయకులని... గత తెలుగుదేశం పార్టీలో నాయకులు దోచుకున్న సొమ్ము ప్రజలకు అప్పగించడమే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి లక్ష్యమని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.  

Back to Top