దుర్గగుడి ఫ్లైఓవర్‌ను ఆగస్టులో ప్రారంభిస్తాం

ప్ర‌జాధ‌నాన్ని దోచుకున్న‌వారిని చ‌ట్టం వ‌ద‌ల‌దు

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

విజయవాడ: ఆగ‌స్టు నెల‌లో దుర్గగుడి ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. ఫ్లైఓవ‌ర్‌ నిర్మాణ పనులను అధికారుల‌తో క‌లిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గ‌గుడి ఫ్లైఓవ‌ర్ ప‌నులు 97 శాతం మేరకు పూర్తయ్యాయ‌ని చెప్పారు. ఆగ‌స్టులో ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభిస్తామ‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం చేత‌ల ప్ర‌భుత్వ‌మ‌ని, చంద్రబాబులా మాటల ప్రభుత్వం కాదన్నారు. విజ‌య‌వాడ అభివృద్ధిని చంద్ర‌బాబు మ‌రిచిపోయాడ‌ని, అమరావతి అనే బ్రమరావతిలో ప్రజలను చంద్రబాబు ఉంచాడని ధ్వ‌జ‌మెత్తారు. కానీ, వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వ హ‌యాంలో విజయవాడలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంద‌న్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా విజయవాడకు కేశినేని నాని ఏం చేశారో చెప్పాల‌ని మంత్రి వెల్లంప‌ల్లి డిమాండ్ చేశారు. `ఇంట్లో తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఎవరినీ చట్టం వదలదు` అని హెచ్చ‌రించారు. అచ్చెన్నాయుడు కార్మికుల డబ్బును దోచుకున్నాడు కాబట్టే జైలుకెళ్లాడని, అదే విధంగా ఎవరు అక్రమాలు చేసినట్లు మా దృష్టికి వచ్చినా చర్యలు తప్పవు అన్నారు.

Back to Top