సంకల్పబలాన్ని చాటాం

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
 

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పిలుపుతో ప్రజలంతా దీపాలు వెలిగించి రాష్ట్ర సంకల్పబలాన్ని చాటామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఇంటింటికి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 33వేల కుటుంబాలకు దాతలు సహకారంతో ఐదు రోజులకు సరిపడా కూరగాయల పంపిణీ చేశామన్నారు. లాక్‌డౌన్‌లో ఏ పేద కుటుంబం ఇబ్బంది పడకూడదనే సీఎం వైయస్‌ జగన్‌ ఉచితంగా బియ్యం, కిలో కందిపప్పు ఇవ్వడంతో పాటు, రూ. వెయ్యి ఆర్థికసాయం చేశారన్నారన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదనే ఐదు రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశామన్నారు. మరో 9 రోజుల పాటు ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top