పేద మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

మంత్రి ఉషాశ్రీ చరణ్‌

అనంతపురం: రాష్ట్రంలో పేద మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉషాశ్రీ చరణ్‌ డిమాండు చేశారు. మహిళా ద్రోహి చంద్రబాబు..ఇళ్ల స్థలాల్లో సమాధులు కట్టాలంటున్నాడని మండిపడ్డారు. ఓటమి భయంతో చంద్రబాబు మహిళలను అవమాన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి రాష్ట్రంలో మహిళలంతా బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి హెచ్చరించారు. మురికి ఆలోచనలతో ఇళ్ల కాలనీలను చంద్రబాబు మురికివాడలు అంటున్నాడు. సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబులో ఫ్రస్టేషన్‌ ఎక్కువైందన్నారు. లోకేష్‌ సభ్యత మరచి మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ గుర్తు, గుర్తింపు లేని పార్టీ నాయకుడు అని ఎద్దేవా చేశారు.
 

Back to Top