ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే ఆదర్శం

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

పశ్చిమగోదావరి: ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రికార్డు నెలకొల్పారన్నారు. మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 1.35 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందించామని వివరించారు. వీరిలో 1.06 కోట్ల మంది ఎస్సీ లబ్ధిదారులకు పథకాలిచ్చామని, కేవలం ఎస్సీలకు రూ.11,346 కోట్లకు పైగా నగదు పథకాల ద్వారా అందించామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎస్సీలకు ఇంత మేలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top