శ్రీకాకుళం: నారా లోకేశ్ ఒళ్లు కొవ్వెక్కి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్‌గా చేసింది టీడీపీ నాయకులేనని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని మండిపడ్డారు. నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీదిరి అప్పలరాజు తిప్పికొట్టారు. పలాసలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారంటే.. – ఈ ఐదేళ్లలో కోవిడ్ కాలం తీసేస్తే మూడున్నరేళ్లలో మీ ఇంటికి ఇంత మేలు చేశాను అని ధైర్యంగా సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. – చంద్రబాబుకు కానీ, ఆయన కొడుకుకు కానీ అలా చెప్పుకునే ధైర్యం ఉందా? – లోకేశ్ యువగళం పాదయాత్ర చేశానని చెప్పుకుంటున్నాడు..ఎవరికైనా తెలుసా..? – ఉదయం విజయనగరంలో ఉంటాడు..సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉంటాడు..అదీ ఆయన పాదయాత్ర. – ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటిల్‌గా చంద్రబాబు చేస్తే మా ప్రభుత్వం గంజాయి క్యాపిటల్‌గా చేశారని విమర్శిస్తున్నాడు. – ఈ ప్రాంతంలో గంజాయి ఎవరు అమ్ముతారో నీకు తెలియదా? మీ పార్టీలోనే ఉన్నాడు కదా అయ్యన్నపాత్రుని కొడుకు.. – ఈ మాట నేను చెప్పింది కాదు...మీ పార్టీలో ఉన్నా గంటా, బండారు చెప్పిన మాటలే. – ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా గంజాయిని నిర్మూలించిన ప్రభుత్వం మాది. ఉత్తరాంధ్రను, రాష్ట్రాన్ని శనిలా పట్టుకుంది చంద్రబాబే – ఉత్తరాంధ్రకు సీఎం వైయస్ జగన్ శని అంటున్నావు..ఎవడు నీకు స్క్రిప్ట్ రాసిస్తాడు..? – వైజాగ్, ఉత్తరాంధ్రలకు నువ్వూ నీ బాబు అసలు ఏం చేశారో చెప్పు..? – భోగాపురం ఎయిర్‌పోర్టు కడుతుండటం శనా? విశాఖను రాజధానిగా ప్రకటించడం శనా? – మూలపేట పోర్టు, హీరమండలం లిఫ్ట్, వంశధార స్టేజ్1, 2 పనులు చేస్తుండటం శనా? – వైజాగ్ మెట్రో ఇస్తున్నందుకు శనా? వైజాగ్ లో పూడిమడక వద్ద హార్బర్, పిష్‌ల్యాండింగ్ సెంటర్లు కట్టిస్తున్నందుకు శనా? – నీకు సిగ్గూ లజ్జా ఉంటే పలానా కంపెనీ ఉత్తరాంధ్రలో పెట్టాను అని దమ్ముంటే చూపించు లోకేశ్.. – అసలు వైజాగ్‌కి సీఎం వైయస్ జగన్ వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చాయో నీకు తెలుసా? నేను చెప్తా..రాసుకో. – నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్కు పనులు ప్రారంభం కాబోతున్నాయి. – యకహోమా టైర్స్, ఇనార్బిట్ మాల్, ఇన్ఫోసిస్ వంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. – పోనీ అంతకు ముందున్న విప్రో, సత్యం వంటి కంపెనీలను తీసుకొచ్చింది మీ బాబా? – అదానీ డేటా సెంటర్ ఎక్కడుంది? కనిపించడం లేదా? – ఒళ్లు కొవ్వొక్కి లోకేశ్ మాట్లాడుతున్నాడు..ఉత్తరాంధ్రకే కాదు ఈ రాష్ట్రానికి పట్టిన శని నీ బాబే. – ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగోదు..నువ్వు రాసేది ఎర్రబుక్కు కాదు..ఎర్రి బుక్కు. నీలాంటి ఎర్రివాళ్లు రాసుకునే బుక్ అది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా మీ బాబు ఏం గాడిదలు కాశాడు? – విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మీరు చేసిందేంటి? – ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే..పరిశ్రమలు ఇక్కడకు వస్తే ఇక్కడే ఉంటారు కదా అంటున్నారు. – మరి మీ బాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశాడు..? – స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది నీ బాబు చంద్రబాబే కదా..? – మీరు మా సిక్కోలుకు, రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఏం చేయలేదు కాబట్టే ఇక్కడి వారు వలసలు వెళ్తున్నారు. – ఆ వలసలు నివారించాలనే మా ముఖ్యమంత్రి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. – అసలు పరిపాలన రాజధాని అంటే నీకు కనీస అవగాహన ఉందా? – రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 28 కేంద్ర సంస్థలు మన రాష్ట్రానికి వస్తే ఒక్కటన్నా శ్రీకాకుళం జిల్లాలో పెట్టించారా? – ఈ దేశంలోనే పనికిరాని ఎంపీ రామ్మోహన్‌నాయుడు..ఆయనను మించిన పనికి మాలినవాడు లోకేశ్. – మా జిల్లా వాళ్లు వలసలు పోతున్నారనే మేం మా జిల్లాలో బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ కట్టించుకుంటున్నాం. – మంచంగిపేట వద్ద హార్బర్ నిర్మాణం కూడా జరుగుతుంది. – ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేట పోర్టు పనులు చేపట్టాం. నీకు దమ్ముంటే వెళ్లి చూడు. – మీ తండ్రి 14 ఏళ్లు 3 సార్లు సీఎంగా చేసి రాష్ట్రంలోని 972 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఒక హార్బర్‌కు కానీ, ఒక పోర్టుకు కానీ కనీసం శంకుస్థాపనైనా చేశాడా? దమ్ముంటే చెప్పండి. – అసలు నువ్వు మంత్రిగా పనిచేయడానికి నీకున్న అర్హతేంటి? – ఈ ఆంధ్రప్రదేశ్ నీ బాబు నీ జాగీరు అనుకుంటున్నావా? ఇక్కడ ప్రజలు చంద్రబాబు బానిసలు అనుకుంటున్నావా? సమాధానం చెప్పి తీరాలి. – మీ బాబు కట్టిన పోర్టులు, హార్బర్లు ఎక్కడ? 14 ఏళ్లు నీ బాబు గాడిదలు కాశాడా? – నువ్వు మాట్లాడే మాటలకు చాలా ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను. 1.70 కోట్ల ఉపాద్యాయ ఉద్యోగాలిచ్చారా? ఎక్కడున్నాయో చూపించు లోకేశ్..? – ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి 1.70 కోట్ల ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చారట..ఎక్కడున్నాయో చూపించు. – ఆసలు లోకేశ్ తెలిసి మాట్లాడుతున్నాడా..? ఈ రాష్ట్రంలోని కుటుంబాలే 1.62 కోట్ల కుటుంబాలున్నాయి. – ఉమ్మడి రాష్ట్రం తీసుకున్నా 2.82 కోట్ల కుటుంబాలు ఉన్నాయనుకుంటే లోకేశ్ చెప్పినట్లు ప్రతి రెండు ఇళ్లలో ఒకదానికి టీచర్ ఉద్యోగం ఉండాలి కదా? – నీలాంటి నోరు తిరగని వాడిని, మాట్లాడేది తప్పోరైటో తెలియని వాడ్ని చంద్రబాబు పాదయాత్రకు పంపాడు. – నేను నడవలేనని పాదయాత్ర ఆపేస్తే చంద్రబాబు శంఖారావం అని పంపించాడు. – కోటి 70 లక్షల టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మీ నాన్నను వెళ్లి అడుగు. – భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ జరగలేదు అంటున్నాడు. వెళ్లి చూడు నాయనా..పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. – శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీ కోసం మీరు కేటాయించిన స్థలం ఎక్కడో చూపించండి. – ఇలాంటి వాడిని చంద్రబాబు పంపించడం వల్ల టీడీపీ సంకనాకించడానికి ఇదే మొదటి అడుగు అని నా అభిప్రాయం. – ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలి. ఈ రాష్ట్రంలో సుమారు 5.6 లక్షల శాశ్విత ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. – వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉన్న శాశ్విత ఉద్యోగాలు 3.4 లక్షలు. కేవలం కోవిడ్ తీసేస్తే ఈ మూడున్నరేళ్లలో 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. – రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 3.4 లక్షలైతే..ఒక్క ఈ ఐదేళ్లలో 2.2 లక్షల శాశ్విత ఉద్యోగాలు ఇచ్చారు. – నీ తండ్రి 2014–19 మధ్యలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు. – కాంట్రాక్టు ఉద్యోగాలు 40వేలు, ఔట్ సోర్సింగ్ 1.23 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. – ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాం. – అలాంటిది ఈ లోకేశ్ కూడా వచ్చి ఉద్యోగాలు గురించి మాట్లాడుతున్నాడు. – జస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీ జాతకం అంతా తెలిసిపోతుంది. నీ బాడీ లాంగ్వేజ్‌కి, నువ్వు మాట్లాడే మాటలకీ పొంతన ఉందా? – నీ బాడీ లాంగ్వేజ్‌కి, నువ్వు మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా? – బ్రహ్మానందం సీరియస్ డైలాగులు చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. – చంద్రబాబు కొడుకువైతే ఏదైనా మాట్లాడవచ్చా? చంద్రబాబు కొడుకువైతే ఎవడికి ఎక్కువ? – నా పలాస నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ లేదని, కట్టించాలని మేం అడుగుతుంటే లోకేశ్ వచ్చే తాము డిగ్రీ కాలేజీకి బిల్డింగులు ఇచ్చానంటున్నాడు. – ఎక్కడిచ్చావు..? నేను ఎమ్మెల్యే అయ్యే వరకూ మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీనే లేదు. – డిగ్రీ కాలేజీనే లేకుండానే భవనాలు ఇచ్చావా? ఇది సాధ్యమా? – ఆర్వోబీ పనులు నువ్వు మొదలుపెట్టావా? అసలు ఎటువైపు ఉంటుందో తెలుసా? – ఎందుకు ఆ పనులు ఆగిపోయాయో తెలుసా..? మా నాయకుడు వాటిని మంజూరు చేస్తే పనులు చేసుకుంటున్నాం. – సీఎం వైయస్ జగన్ హయాంలో వంశధార స్టేజ్ 1, 2 పనులు పూర్తిచేసుకుంటున్నాం. – నేరడి బ్యారేజీ అంటే ఎంటో, ఎక్కడుందో నీకు తెలుసా? మీ తండ్రిని అడుగు చెప్తాడు. – నేరడి బ్యారేజీ కట్టకపోతే హీరమండలం రిజర్వాయర్‌కి ఫుల్ కెపాసిటీ నీళ్లు రావు. – దాని కోసం ఒరిస్సాతో మాట్లాడాలని, నేరడి బ్యారేజీ కట్టాలని, కోర్టుల్లో దానిపై ఫైట్ చేయాలని మీ నాన్న ఎప్పుడూ ఆలోచించలేదు. – మా నాయకుడు వైయస్ జగన్ ఒడిషాతో మాట్లాడారు. తాత్కాలికంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నిర్మిస్తున్నారు..కావాలంటే నువ్వెళ్లి చూడొచ్చు. చంద్రబాబు ఉత్తరాంధ్రను వలసలాంధ్రగా మార్చాడు – చంద్రబాబు తన 14 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసి ఉత్తరాంధ్రను వలసలాంధ్రను చేసింది చంద్రబాబే. – నీలాంటి చదువు సంధ్య లేనటువంటి వాడ్ని అసలు మేం పట్టించుకోం. – నువ్వేంటి మా స్పీడ్‌కు బ్రేక్ వేయగలవా? అసలు నువ్వే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావో, మీ నాన్న కుప్పంలో పోటీ చేస్తున్నాడో లేదో చెప్పు ముందు. – ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఈ జిల్లాకు నయాపైస ఉపయోగం లేదు. – రాజకీయాల్లో హుందాతనం కోల్పోయి మాట్లాడటం సరికాదు. వార్నింగులు, ఇష్టానుసారం దూషణలు మంచిది కాదు. – చంద్రబాబు పిచ్చి వేదికపై ఉన్న నాయకులకు కూడా అంటిందని అనుమానంగా ఉంది. – మళ్లీ అడుగుతున్నా..నిర్మాణాత్మకమైన చర్చకు నేను సిద్ధం..ఉత్తరాంధ్రలోని ఏ జిల్లాలోనైనా సరే. – మీ నాన్న 14 ఏళ్ల డేటా నువ్వు తెచ్చుకో...ఈ ఐదేళ్ల డేటా నేను తీసుకొస్తా. – నువ్వు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను..నీకు దమ్ముందా? – ఇవే మీకు చిట్టచివరి ఎన్నికలు కాబట్టి మీ నాన్నని ఆరోగ్యం బాగా చూసుకోమని చెప్పు. – నువ్వు ఎంత ఎక్కువ చేస్తే అంతకు మించి మేం కూడా మాట్లాడగలమని గుర్తించుకో. – నేను రూ.600 కోట్లు సంపాదించానని విమర్శిస్తున్నాడు..కాకపోతే ఆ డబ్బులన్నీ ఆస్తుల రూపంలో ఉన్నాయి. – నా బినామీల పేర్ల మీద ఉన్నాయి. గౌతు విజయలక్ష్మి, యార్గగడ్డ శిరీషా, గౌతు అనురాధా వంటి వారే నా బినామీలు. – అనేకమైన ఆస్తులు ఈ బినామీల పేరుపై నేను సంపాదించాను. వాటిని ఇప్పుడు లోకేశ్ చేతుల మీదుగా ప్రజలకు పంచాలని అనుకుంటున్నాను. – దయచేసి లోకేశ్ ఈ అస్తులను పంచేందుకు ముందుకు రావాలని కోరుతున్నా. – టిడ్కో ఇళ్లు చూశాడట...ఒక మూడేళ్ల క్రితం వాటిని చూస్తే వాళ్ల నాన్న ఎంతవరకూ కట్టాడో తెలిసేది. – వాటిని పూర్తిచేసిన ఘనత మాది..వాటిని త్వరలో లబ్ధిదారులకు అందిస్తున్నాం. – ఆయన చూసిన టిడ్కో ఇళ్లకు ఎదురుగా చూసినట్లు లేడు..చూస్తే 75 ఎకరాల్లో 2500 ఇళ్లతో జగనన్న కాలనీ ఒక నగరంలా కనిపించి ఉండేది. – ఇలాంటి టౌన్‌షిప్‌లో మా నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. – టౌన్‌లోంచి వెళితే సగర్వంగా కనిపిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కి సలాం చేయాల్సి వస్తుందని రాలేదనుకుంటా. – అది ఒక గందరగోళ ‘సంకా’..రావ యాత్ర. – నా ఎన్నికల అఫడవిట్ గమనిస్తే నాపై నాలుగు కేసులుంటాయి. – నేను రాజకీయాల్లోకి 2017 మేలో వచ్చాయి. ఎన్నికలు 2019 ఏప్రిల్‌లో వచ్చాయి. – ఈ రెండేళ్లలో ప్రతిపక్షనేతగా నాపై పెట్టిన కేసులు 4. ఇప్పుడు ఇక్కడున్న గౌతు శిరీషపై ఎన్ని కేసులున్నాయి? – మేమోదో కేసులు పెడుతున్నాం అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు లోకేశ్. – మేము ఎన్ని పేర్లు రాసుకోవాలి..ఈ ఎర్రబుక్కులు ఎన్ని రాసుకోవాలి? – మీరున్నప్పుడు ఎంత మందిపై రౌడీషీట్లు ఒపెన్ చేశారో ఎవరికీ తెలియదనుకుంటున్నా? – ఎంత మంది మా కార్యకర్తలను మీరు రాచిరంపాన పెట్టారో అందరికీ తెలుసు. – కానీ మేం ప్రజలకు అలాంటి పరిస్థితులు రాకూడదని ఏ రోజు కూడా మేం అదుపుతప్పలేదు. – రెండు నెలలు ఆగండి మిమ్మల్ని తరిమేస్తాం అంటున్నారు..మేం అధికారంలో ఉన్నాం కదా..? మేం చేయలేమా?