సంగం డెయిరీని చంద్రబాబు దివాళా తీయించారు

మంత్రి సీదిరి అప్పలరాజు

సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది

డెయిరీలోకి టీడీపీ నేతల ఎంట్రీతో అక్రమాలు మొదలయ్యాయి

తాడేపల్లి: సంగం డెయిరీని చంద్రబాబు దివాళా తీయించారని మంత్రి సీదిరి అప్పలరాజు వివరించారు. డెయిరీలోకి టీడీపీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో అక్రమాలు మొదలయ్యాయని చెప్పారు. టీడీపీ నేతలు పథకం ప్రకారం డెయిరీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.  

 మంచి జరుగుతుంటే.. రామోజీకి నిద్రపట్టడం లేదేమో..!
        చంద్రబాబు మూసేసిన చిత్తూరు డెయిరీని తిరిగి తెరిపిస్తుంటే.. చంద్రబాబుకు, ఈనాడు రామోజీరావుకు పట్టలేని బాధ కలుగుతుంది. ఎందుకంటే, వారి హెరిటేజ్ కు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని  చంద్రబాబు గతంలో తన మనుషులకు కేటాయించిన సంగం, ఇతర డెయిరీల అక్రమ పునాదులు ఎక్కడ కదిలిపోతాయన్నదే వారి బాధ అంతా. 
"రాష్ట్రంలో రైతులకు ఇంత మంచి జరుగుతుంటే.. ఈనాడు రామోజీరావుకు నిద్ర పట్టడంలేదు. ఏం మాటలు.. ఏం రాతలు రామోజీ.....?. 
ఈ రాష్ట్రానికి ఒకే వ్యక్తి సీఎంగా ఉండాలి. అదికూడా చంద్రబాబే ఉండాలి.
ఒకే రాజధాని ఉండాలి. అది అమరావతై ఉండాలి.
ఒకే డెయిరీ ఉండాలి. అది హెరిటేజ్‌ అయి ఉండాలి. 
ఒకే పేపర్‌ ఉండాలి. అది ఈనాడు ఉండాలనేదే కదా నీ ఉద్దేశం. 
దీనికి డొంకతిరుగుడు మాటలేందుకు.. నేను చంద్రబాబు తొత్తును. నా పేపర్‌ ఈనాడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు అధికారానికే పనిచేస్తుందని నేరుగా చెప్పు..
అంతేగాని డొంకతిరుగుడు రాతలతో ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నించొద్దు."
ఇప్పుడు రోజులుమారాయి. ప్రజలు వాస్తవాలు అనేక మాధ్యమాలు ద్వారా తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు ఒళ్లు దగ్గరపెట్టుకుని బాధ్యతగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.

బాబు హయాంలో 54 సంస్థల ప్రైవేటైజేషన్, మూత
             ప్రైవేటైజేషన్‌( ఎ సక్సెస్‌ స్టోరీ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌) పేరుతో చంద్రబాబు 2003లో ఒక పుస్తకం తెచ్చాడు. బాబు హయాంలో పబ్లిక్‌ సెక్టార్‌లో ఉన్న ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రైవేటీకరణ చేసి లేక మూసేసి, అదేదో తాను సాధించిన గొప్పగా చెప్పుకున్నాడు. ఏపీలో  ప్రైవేటైజేషన్‌ అనేది గొప్ప సక్సెస్‌ స్టోరీ అని పుస్తకం రాసుకున్నాడు. ఈ రోజు మళ్ళీ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. బాబు హయాంలో ప్రైవేటీకరణ జరగలేదని మాట్లాడుతున్నారు. 1995 నుంచి 2004 సమయంలో దేశం మొత్తమ్మీద 108 పబ్లిక్‌ సెక్టార్‌లో ఉన్న ఎంటర్‌ప్రైజెస్‌లు ప్రయివేటీకరణ జరిగితే.. ఒక్క ఏపీలోనే 54 కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటినీ క్లోజ్‌ చేశారు. మూతేసిన సంస్థల్లో 2002లో చిత్తూరు జిల్లా మిల్క్‌యూనియన్‌ ఒకటి. ప్రజల సొమ్మును అప్పన్నంగా కాజేసే కుట్రలకు పాల్పడటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పాడిపరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతుల కష్టాన్ని నిలువు దోపిడీ చేసిన ఘనుడు బాబే. ఈరోజు చంద్రబాబు, అతనికి వత్తాసుపలికే పచ్చమీడియా రాతల్లో.. అమూల్‌ డెయిరీకి సంబంధించి చేసిన దుష్ప్రచారాల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. చిత్తూరు పాల డెయిరీకి అమూల్‌కు కట్టబెడుతున్నామనే టీడీపీ నేతలు, పచ్చమీడియా మాటలు పూర్తిగా అబద్ధాలు. 

- ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలోని పాలడెయిరీలు, వాటిని నడుపుతున్న యాజమన్యాలు, సొసైటీ చట్టాల దుర్వినియోగాలను గురించి పరిశీలిస్తే.. టీడీపీ అక్రమాల బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు, ఒంగోలు, కృష్ణా, విశాఖ, విజయ మిల్క్‌యూనియన్‌ డెయిరీల్ని చంద్రబాబు తన సొంతమనుషులకు అడ్డదారిన కట్టబెట్డాడు. కో ఆపరేటివ్‌ చట్టం నుంచి మ్యాక్స్‌ చట్టంలోకి మార్చడం.. ఆ తర్వాత ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీలుగా వాటిని  మార్చుకునేందుకు కంపెనీ చట్టాన్ని తెరమీదికి తెచ్చిన విధానం అందరికీ తెలిసిందే. వాస్తవానికి కంపెనీ చట్టం పరిధిలోకి  ఏదైనా సొసైటీ రావాలంటే.. ఇంటర్‌స్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి. అదికూడా ఆయా సొసైటీలకు సంబంధించి ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు, షేర్‌క్యాపిటల్, ప్రభుత్వ గ్యారెంటీస్, వాటికి సంబంధించిన ఎంవోయూలు..  వీటన్నింటినీ క్లియర్‌ చేసి నో అబ్జెక్షన్‌ తీసుకోవాలి. కానీ, చంద్రబాబు అండ్‌ కో మాత్రం అప్పట్లో తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలేమీ పాటించకుండానే డెయిరీలను ఇష్టానుసారంగా కంపెనీ ^è ట్టం కింద మార్చేసుకని ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీలకు యజమానులుగా చెలామణి అవుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, కొన్ని డెయిరీల నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్లకు (ఎన్వోసీ) సంబంధించి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కనీసం నోట్‌ఫైల్స్‌ కూడా లేకపోవడం గమనార్హం. దీన్నిబట్టి, ప్రభుత్వ, ప్రజల డెయిరీలను చంద్రబాబు, ఆయన సొంత మనుషులు ఎంత కుట్రపూరితంగా.. ఎలా సొంతం చేసుకున్నారనేది గమనించవచ్చు. 

హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని మూతేసిన బాబు..
రాష్ట్రంలో ఉన్న అన్ని మిల్క్‌ డెయిరీ యూనియన్‌లను అడ్డగోలుగా ప్రయివేటీకరణ చేసిన చంద్రబాబు- చిత్తూరు మిల్క్‌యూనియన్‌ డెయిరీ విషయానికొచ్చేసరికి ఒక గమ్మత్తైన విధానం అమలు చేశాడు. ప్రభుత్వ ఆస్తులు, పెట్టుబడులు, ప్రజల కష్టంతో నడిచే డెయిరీల్ని కంపెనీలుగా మార్చుకుంటే ఏనాటికైనా ప్రమాదం వస్తుందనే ఆలోచనతో చిత్తూరు మిల్క్‌డెయిరీని ఒక వ్యూహాత్మక విధానంతో దాన్ని మూతేయించాడు. దాని ప్రాంతంలో తన సొంత హెరిటేజ్ ని నెలకొల్పి డెవలప్‌ చేసుకున్నాడు.  చిత్తూరు మిల్క్‌యూనియన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. దేశంలోనే అత్యధికంగా ప్రొక్యూర్‌మెంట్‌ జరిగిన డెయిరీ అది. రోజుకు 2.5లక్షల లీటర్ల పాలను సేకరించే డెయిరీ. అత్యధిక లాభాలు గడించిన చిత్తూరు డెయిరీని మూతేసి బాబు హెరిటేజ్‌ పేరిట ప్రయివేటు  డెయిరీ పెట్టుకున్నాడు.

అక్రమాల పుట్ట సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది
సంగం డెయిరీ పుట్టుపూర్వోత్తరాలు రైతులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వడ్లమూడి దగ్గర కరువు మేనేజ్మ్‌మెంట్‌లో భాగంగా పూర్వం 34 ఎకరాల భూమితో ప్రభుత్వం రూ.81 లక్షల షేర్‌ కాపిటల్‌ ను అందించి పూర్థిస్థాయిలో సంగం డెయిరీని ప్రారంభించింది. గుంటూరు మిల్క్‌యూనియన్‌కు అధ్యక్షుడుగా ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ఉన్న సమయంలో ఆయన 1994లో డెయిరీకి చెందిన పదెకరాల భూమిని  వాళ్ల సొంత ట్రస్టుకు బదలాయించుకుని ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లో అప్రూవ్‌ చేసుకున్నాడు. అప్పటికి కో ఆపరేటివ్‌ సొసైటీ కింద నడుస్తున్న మిల్క్‌ యూనియన్‌ అది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత 1995లో మ్యాక్స్‌ చట్టం వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించి బకాయిలు క్లియర్‌ చేసి జిల్లా రిజిస్ట్రార్‌ వద్ద ఎన్వోసీ తీసుకున్న తర్వాతనే మ్యాక్స్‌ చట్టంలోకి మార్చాల్సిన డెయిరీని, ఇవేవీ పట్టించుకోకుండా అడ్డగోలుగా మార్చేశారు. మ్యాక్స్‌ చట్టంలోకి అక్రమంగా మార్చడం.. ఆ తర్వాత కంపెనీ చట్టం కిందకు చేర్చుకోవడం.. ఇదంతా చంద్రబాబు కుట్ర ప్రకారమే జరిగింది. సంగం డెయిరీ కంపెనీ యాక్ట్‌ ఇల్లీగల్‌.. అంటూ కేసులు కోర్టులో నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులు ట్రస్టుకు బదలాయించుకోవడం అక్రమం. ఏసీబీ తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కోర్టులో స్టేలు తెచ్చుకుని ధూళిపాళ్ల నరేంద్ర ప్రగల్భాలు పలుకుతున్నారు. కోర్టు సంగం డెయిరీపై స్టేలు ఇచ్చిందే తప్ప .. కేసులు రద్దు చేయలేదు. ఏరోజుకైనా సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ పెట్టుబడులు, ప్రజల భాగస్వామ్యంను అన్నీ వెలికితీసి అందరికీ అప్పగిస్తాం.

పేమెంట్‌ కుక్క పట్టాభి..
        పట్టాభి చంద్రబాబు దగ్గర పనిచేసే పేమెంట్ కుక్క. అరే పట్టాభి.. నీ భాషకు.. నీ బాడీలాంగ్వేజీకి ఏమైనా మ్యాచ్‌ అవుతుందా..? ఈసారి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారి గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడితే.. మామూలుగా ఉండదు. ఆరోజు సీఐడీ నమోదు చేసిన కేసులో బట్టలిప్పి నీ ఒంపుసొంపులు అందరికీ చూపావుగా.. ఈసారి ప్రజలే నిన్ను రోడ్డుమీద నిలబెట్టి బట్టలు ఊడదీస్తారు..నోరు అదుపులో పెట్టుకో పట్టాభి.. ఈసారి నీకు నువ్వే రికార్డు చేసుకుని వీడియో పెట్టే అవకాశం ఉండదు.. ఎందుకంటే ప్రజలే పబ్లిక్ గా నీకు తగిన శాస్తి చేసి, ఆ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెడతారు. 

సచివాలయాల పరిధిలో మహిళా కో ఆపరేటివ్‌ మిల్క్‌ డెయిరీలు
అమూల్‌ మిల్క్‌ డెయిరీ సంస్థకు ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందనే అవాస్తవాల్ని పచ్చమీడియా ఈనాడు ద్వారా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈరోజు అమూల్‌ సంస్థ ప్రభుత్వానికి ఒక మార్కెటింగ్‌ పార్టనర్‌ మాత్రమే.. సచివాలయాల స్థాయిలో మహిళా కో ఆపరేటివ్‌ డెయిరీ సంఘాలు పెట్టబోతున్నాం. వాళ్లకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడ్‌ చేయడానికి .. మిల్క్‌ కలెక్షన్‌ కోసం కెపాసిటేటివ్‌ బిల్డింగ్‌ను నిర్మించబోతున్నాం. బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్‌ ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రైతులకు అదనపు అదాయం కోసం ప్రాసెసింగ్‌ చేయడానికి యూనిట్లు లేవు కనుక గుజరాత్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ వాళ్ల బ్రాండ్‌ అమూల్‌ సంస్థను గుర్తించాం. దేశవ్యాప్తంగా కో ఆపరేటివ్‌ స్పిరిట్, ఫిలాసఫీ, ఇంటిగ్రిటీని నరనరాన జీర్ణించుకున్న సంస్థగా అమూల్‌ ఉండటంతో మనకు మార్కెటింగ్‌ పార్టనర్‌గా పెట్టుకున్నాం. ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టబోయే మహిళా కో ఆపరేటివ్‌ మిల్క్‌ డెయిరీలకు ఆపరేషనల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం అమూల్‌ పనిచేస్తుంది. పాలు పోస్తున్న రైతుల్ని కో ఆపరేటివ్‌ సొసైటీలో యజమానులుగా తీర్చిదిద్దుతున్న సంస్థ అమూల్‌ ఒక్కటే..  రైతులకు డివిడెంట్‌ల రూపంలో లాభాలు పంచడం జరుగుతుంది. రైతులకు 10శాతం ఫ్యాట్‌ ఉన్న గేదె పాలు లీటరుకు సంగం, హెరిటేజ్‌ డెయిరీలు రూ. 58 ఇస్తే.. అమూల్‌ రూ. 65 ఇస్తుంది.  అదే ఆవుపాలకు సంగం, హెరిటేజ్‌ రూ.23ఇస్తే అమూల్‌ మాత్రం రూ.25 ఇస్తుంది. అమూల్‌ రాకపోయి ఉన్నట్లయితే రైతు దోపిడీనే జరిగేది కదా.. 
గతంలో రైతుల కష్టం దోపిడీ జరుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదు.. అమూల్‌ వల్ల మేం కూడా బోనస్‌ రూపంలో రైతులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని.. ధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తుందని.. అమూల్‌ అందించే ఇన్‌పుట్స్‌ మేం కూడా ఇవ్వాల్సి వస్తుందని మిగతా డెయిరీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్న మాట వాస్తవం కాదా..? 

Back to Top