ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళనలు

రాజధానికి పెట్టి అమరావతి పేరు చెడగొట్టారు

చంద్ర‌బాబుపై మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ఫైర్‌

విశాఖ‌:  రాజ‌ధాని పేరుతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేస్తున్నడ్రామాల‌ను మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు తీవ్రంగా ఖండించారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తార‌ని మంత్రి మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరును రాజధానికి పెట్టి ఆ పేరును చంద్ర‌బాబు చెడగొట్టారని విమ‌ర్శించారు. ప్రస్తుతం అమరావతి రాజకీయ ఎత్తుగడలకు వేదికగా మారిందని, తానే అమరావతికి పేరు తెచ్చినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ధ్యాన బుద్ధ విగ్రహంపై చంద్రబాబుకు పేటెంట్ లేదన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళనలను నడిపిస్తారో చూస్తామని వ్యాఖ్యానించారు.  టీడీపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇంకా ఎన్ని రోజులు పెయిడ్ ఆందోళనలు నడిపిస్తారు? అంటూ మండిపడ్డారు.  పెయిడ్ దీక్షలకు కమ్యూనిస్టులు మద్దతు తెలపడం దారుణమన్నారు. రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రిప్రజెంటేషన్‌ ఇవ్వాలని సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top