టిడిపి.. తెలుగు దుశ్శాసనుల పార్టీగా మారింది 

రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి  ఆర్కే రోజా  
 

విజయవాడ:  తెలుగు దేశం పార్టీ తెలుగు దుశ్శాస‌నుల పార్టీగా మారింద‌ని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి  ఆర్కే రోజా  మండిప‌డ్డారు.   రాష్ట్రంలో టిడిపి నేతలే అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నార‌ని ఫైర్ అయ్యారు.  యువతులు, మహిళలపై టీడీపీ నేతల అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ నోరు మెదపరు ఎందుకు..? అని నిల‌దీశారు. శ‌నివారం రోజా విజ‌యవాడ‌లో మాట్లాడారు.  టీడీపీ నేత వేధింపుల వల్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంద‌న్నారు.  ఆడవాళ్ళని వేధించిన వాళ్ళకే టీడీపీలో పదవులు ఇస్తున్నారు.  దివ్యవాణి చెప్పినట్టు మహిళల్ని వేధించినవాళ్ళకే టీడీపీలో పదవులు ఇస్తున్నారు. ప్రతిదానికి ట్వీట్స్ చేసే  లోకేష్... ఇప్పుడెందుకు ట్వీట్ చెయ్యలేదు..?.  ఐ-టీడీపీ అంటే.. ఈడియట్స్ టీడీపీ గా మారిందని,  టీడీపీ నేతలను రాష్ట్రంలో మహిళలంతా తరిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు.

Back to Top