పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది

పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు! 

చంద్రబాబు దగ్గర ఊడిగం చేయడంతోనే పవన్ అధఃపాతాళానికి వెళ్ళిపోయాడు

ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వా.. సీఎం వైయ‌స్‌ జగన్ గురించి మాట్లాడేది?

విశాఖ‌: పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింద‌ని మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడంతోనే పవన్ అధహ పాతాళానికి వెళ్ళిపోయాడన్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్.. సీఎం వైయ‌స్ జగన్ గురించి మాట్లాడుతాడా? అని మండిపడ్డారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి.. చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటి? అని మంత్రి రోజా ప్రశ్నించారు. 

విశాఖలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ… ‘ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. అదే సాధ్యం అయితే అర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధాని అయ్యేవాడు. పవన్ తన తప్పులు కేడర్ మీద రుద్దడం సిగ్గు చేటు. చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడంతోనే అతడు అధఃపాతాళానికి వెళ్ళిపోయాడు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వా.. సీఎం వైయ‌స్‌ జగన్ గురించి మాట్లాడేది?. బూత్ కమిటీలు, మండల కమిటీలు వేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిది. పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటి?. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించలేదు’ అని అన్నారు.

 
పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా?. రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించాం. అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రీ మెన్ కమిటీ సూచించింది. ముఖ్యమంత్రి అంగీకరిస్తే అది క్యాంప్ కార్యాలయం అవుతుంది, లేదంటే టూరిజం భవనాలుగా ఉంటాయి. బండ్ల గణేష్ ఎవరు?. సెవెన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటాను అన్నాడు అతనేనా. ఒక మహిళ ఎదుగుతుంటే నీచంగా మాట్లాడటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జనసేన, టీడీపీలకు అలవాటుగా మారింది. అందుకే మహిళలు వాళ్ళను అసహ్యించుకుంటున్నార‌ని మంత్రి రోజా పేర్కొన్నారు.

Back to Top