44 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు జీవితమంతా 420 పనులే..

రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా  

ఇప్పుడున్నది ఎన్టీఆర్ టీడీపీ కాదు.. నారా వారి నకిలీ టీడీపీ

 మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమీ లేదు

మాది సామాజిక న్యాయ భేరి.. మీది సన్నాసుల మహానాడు

 టీడీపీ హయాంలో కంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే టీడీపీ కార్యకర్తలకు ఎక్కువ మేలు జరిగింది.. ఛాలెంజ్ చేస్తున్నా

 ఎన్టీఆర్ ను చంపేసిన వాళ్ళే..  ఆయన జయంతి వేడుకలు చేయడమా..!?

 175 స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకని టీడీపీని అధికారంలోకి తెస్తామని బాబు పగటి కలలు కంటున్నారు

 రాష్ట్రంలో కుల చిచ్చు పెట్టి తగలబెడుతున్న టీడీపీ నేతలు, ప్రజల చేతిలో దెబ్బలు తినడం ఖాయం

14 ఏళ్ళు బాబు అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకూరు అభివృద్ధి గుర్తుకు రాలేదా బాలకృష్ణా..?

 కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు మహానాడులో ధన్యవాదాల తీర్మానం చేశారా?

తాడేప‌ల్లి: 44 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు జీవితమంతా 420 పనులే అని రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా విమ‌ర్శించారు. ఎన్టీఆర్ గారి వందో జయంతి సందర్భంగా మహానాడులో టీడీపీ చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే ఎవరైతే ఎన్టీఆర్‌ని చంపేశారో... వాళ్లే మళ్లీ ఆయనకు నివాళులు అర్పించడం  చూస్తుంటే ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. పిలిచి పిల్లను ఇచ్చాడన్న కనికరం కూడా లేకుండా అధికార దాహంతో ఎన్టీఆర్‌ గారికి వెన్నుపోటు పొడిచి, పార్టీని, పార్టీ గుర్తును, ఆయన పార్టీ పేరు మీద బ్యాంక్‌ లో  ఉన్న డబ్బులన్నీ దోచేసుకుని చంద్రబాబు నాయుడు, ఇవాళ  ఎన్టీఆర్‌ గారి మీద ప్రేమ ఉన్నట్లు, ఆయన విగ్రహానికి దండ వేసి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. శ‌నివారం తిరుప‌తి ప్రెస్ క్ల‌బ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు. 

బాబు లైఫ్ అంతా 420  పనులే
        ప్రతి మహానాడు వేడుక రోజున ఎన్టీఆర్‌ గారు ఎదురుచూస్తుంటారనుకుంటాను. తనకు వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కుని, తన చావుకు కారణమయినందుకు చంద్రబాబు క్షమాపణలు చెబుతారని ఎదురు చూస్తుంటారు కానీ, ఏ మహానాడులోనూ అది జరగకపోవడం బాధాకరం. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఏదైనా చేయలగలడనేది ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాం. 44 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పడమే కానీ.. ఆయన లైఫ్‌ అంతా 420 పనులే. ఎన్టీఆర్‌జయంతి సందర్భంగా మహానాడు నిర్వహిస్తున్నప్పుడు ఆయన గొప్పతనం, రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తీసుకువచ్చిన మార్పు గురించి చెప్పాలి. పోనీ చంద్రబాబు, 14ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన పనులు గురించి చెప్పాలి. ప్రజలు 2019 ఎన్నికల్లో ఎందుకు ఛీకొట్టి, ఎందుకు తరిమికొట్టారో దాన్ని తెలుసుకుని సరిదిద్దుకునే పని చేయాలి, చేతనైతే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ టీడీపీ మహానాడు ఆద్యంతం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.  వయసు, ఆడ,మగా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ.. . బూతు పురాణాలు మాట్లాడటం తప్ప, నిర్మాణాత్మకమైన విమర్శలుగానీ, ఇవి చేస్తాము అని గానీ ఏ ఒక్క విషయంపైన అయినా చర్చించారా?  మహానాడులో వాళ్లు మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తుంటే 44 ఇండస్ట్రీ చంద్రబాబుకు,  49 ఇయర్స్‌ ఉన్న జగన్‌గారిని చూస్తే ఎంతగా భయమేస్తుందో అర్థమవుతుంది. 

బాబుకు రోజా ఛాలెంజ్..
        చంద్రబాబుకు ఒకటే ఛాలెంజ్‌ చేస్తున్నా... ఆఖరికి కుప్పం అయినా, కడప అయినా, కృష్ణాజిల్లా అయినా,  లేకుంటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే ఏ కార్యకర్త ఇంటికైనా వెళదాం.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ కార్యకర్తలు లాభపడ్డారా? లేక వైయస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడు లాభపడ్డారా అన్నది గడప గడపకు వెళ్ళి చూద్దాం. మీరు సిద్ధమా..?

- నాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. అర్హతే ప్రామాణికంగా, రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందాలని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే జగన్‌గారు ఏదైతే చెప్పారో.. ఆరోజు నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులుగా మేము కూడా అదేవిధానంలో ముందుకు వెళుతున్నాం. జగనన్న ప్రభుత్వంలో.. వారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, జనసేన, బీజేపీ కార్యకర్తలు అయినా సంక్షేమ పథకాల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. అందుకే మేము గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్ళి మేము ఇది చేశాం అని చెప్పగలుగుతున్నాం. ప్రజలంతా ఆశీర్వదించి మమ్మల్నిఎలా ఆహ్వానిస్తున్నారో అందరూ చూస్తున్నారు. చంద్రబాబు మనసులో ఒక కుట్ర సిద్ధాంతాన్ని తయారు చేసుకుని,  ఆవిధంగా తన అనుకూల మీడియాలో ముందుగా ప్రసారం చేయిస్తారు. ఆ విధంగా ఎల్లో మీడియాలో దొంగతనంగా ఏదో ఒకటి ఎడిటింగ్‌ చేసి, మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేసి దుష్ప్రచారాలు చేసే  బదులు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూసేందుకు, ప్రతి నియోజకవర్గంలో మాపై పోటీ చేసిన నాయకులు మాతో రావాలని మేమే ఆహ్వానిస్తున్నాం. టీడీపీ మేనిఫెస్టోతో వాళ్లు... మా మేనిఫెస్టోతో మేము ప్రజల వద్దకు వెళతాం. ఇచ్చిన హామీలు ఎవరు అమలు చేస్తున్నారో ప్రజలకే అర్థం అవుతుంది.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇచ్చిన హామీలను అమలుచేయడం దేవుడెరుగు, ఏకంగా మేనిఫెస్టోనే వెబ్‌సైట్‌లో నుంచి ఎత్తేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు.

- జగన్ మోహన్ రెడ్డిగారి మూడేళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత  ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి మేము ఇచ్చిన హామీల్లో 96 శాతం అమలుచేశామని గర్వంగా చెప్పగలుగుతున్నాము. జగన్ గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నారు. ఎక్కడైనా టెక్నికల్‌ సమస్యల వల్ల ఆలస్యం అయితే వాటిని సరిదిద్దేలా, ప్రజలు ఇంకేమైనా కోరుకుంటుంటే అవి కూడా తెలుసుకుని ఈ రెండేళ్లలో వాటిని కరెక​‍్ట్‌ చేసుకోమని చెబుతూ ప్రజాప్రతినిధులను ప్రజల్లోకి వెళ్లమన్నారు. అదీ నాయకత్వం అంటే, నాయకుడు అంటే.

జగనన్న కటౌట్ కు ఉన్న వ్యాల్యూ అది
    చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనంలోకి రావడానికి కూడా భయపడ్డారు. కానీ జగన్‌గారు జనంలోకి రావడానికి ఎప్పుడూ భయపడలేదు. ఆయన ఎక్కడకు వెళ్లినా  జనసమూహం‍లా ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ మహానాడుకు జనాలువచ్చే పరిస్థితి లేదు. అదే జగనన్న ఫోటో పెట్టుకుని 17మంది మంత్రులు సామాజిక న్యాయ భేరి యాత్ర ద్వారా జనాల్లోకి వెళితే జనప్రభంజనం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అది జగనన్న కటౌట్‌కు, ఆయనకున్న ఫేస్‌ వాల్యూ అన్నది ఇప్పటికైనా టీడీపీ వాళ్లు తెలుసుకోవాలి.

- ఫ్యాన్‌ పార్టీ గాలి పార్టీ అంటూ అచ్చెన్నాయుడు అచ్చొసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడు. మా ఫ్యాన్‌ గాలికి చంద్రబాబు, లోకేష్‌ బాబు ఖంగుతిని ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి తిరుగుతున్నారు. తిరుపతి  ఉప ఎన్నిక తర్వాత, టీడీపీ లేదు తొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు మాటలు ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే పరిస్థితిలో ఉంది.

30 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరు
    చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతారని మహానాడులో ఉపన్యాసాలు దంచుతున్నారు. ఆ పార్టీకి 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని లోకేష్‌ మీడియా చిట్‌చాట్‌లో చెప్పడం చూస్తే, ఇంకా ఎన్నిచోట్ల లేరో ఆయనే చెప్పాలి. 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను పెట్టుకోలేని పార్టీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయిన తెలుగుదేశం పార్టీ..  భవిష్యత్‌లో జగనన్నను ఓడిస్తానంటుంటే జనాలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీసి, అప్పులపాలు చేసినందుకు మీకు పట్టం కట్టాలా బాబూ? రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసినందుకు మీకు పట్టం కట్టాలా? తెలంగాణ నుంచి న్యాయబద్ధంగా ఏపీకి రావాల్సిన ఆస్తులను మీ ఓటుకు కోట్లు కేసుకు తాకట్టు పెట్టినందుకు మీకు పట్టం కట్టాలా చంద్రబాబూ అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.

మాది సామాజిక న్యాయ భేరి.. మీద సన్నాసుల మహానాడు
    సామాజిక న్యాయ భేరి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు బస్సుయాత్ర చేస్తుంటే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు. 25మంది ఉన్న మంత్రివర్గంలో 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ  వర్గాల వారికే చోటు కల్పించారంటే సామాజిక న్యాయం మీద జగనన్నకు ఎంత చిత్తశుద్ది ఉందో అందరూ గమనించాలి.  మాది సామాజిక న్యాయం చేసే బస్సుయాత్ర అయితే.. మీది సన్నాసులు చేసే మహానాడు అని ప్రజలు అందరికీ అర్థమవుతోంది.  ఈ మూడేళ్లలో జగనన్న లక్షా 40వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తే అందులో రాష్ట్ర జనాభాలో 80శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు లబ్ధిపొందారు. అందుకే జగనన్నకు అందరూ జై కొడుతున్నారు. దాన్ని కూడా మీరు రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరం. 

ప్రజల చేతిలో దెబ్బలు తినడం ఖాయం
    కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ గారి పేరు పెట్టిన తర్వాత ఏవిధంగా విధ్వంసకాండ సృష్టించి, పైగా మా మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను మేమే తగలబెట్టించామంటూ సిగ్గులేకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు మాట్లాడుతున్నారంటే ప్రజల చేతిలో  వీళ్లు దెబ్బలు తినడం ఖాయం అని స్పష్టం అవుతోంది. మొన్నటివరకూ అంబేద్కర్‌ గారి పేరు పెట్టాలన్న చంద్రబాబు, టెంట్‌లు వేసి నిరాహార దీక్షల చేసి జనసేనవాళ్లు అడిగారు?  ప్రజల కోరిక అయితేనే జగనన్న ఏదైనా చేస్తారు. అంబేద్కర్‌గారు భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలు గుర్తించిన మేధావి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే మన హక్కులను కాపాడుకోగలుగుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి పేరు కోనసీమ జిల్లాకు పెడితే దాన్ని ఏవిధంగా రాజకీయ లబ్దికోసం వాడుకున్నారో,  మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇళ్లను ఏవిధంగా తగలబెట్టారో రాష్ట్ర ప్రజలంతా చూశారు.

- కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ గారి పేరు ఉంచాలా వద్దా అనేది టీడీపీ, జనసేన, బీజేపీలు సూటిగా చెప్పాలి? రాజకీయ లబ్దికోసం పిచ్చి వాగుడు, పిచ్చి చేష్టలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ సహించేది లేదు. బాదుడు బాదుడే కార్యక్రమాన్ని చంద్రబాబు శ్రీకాకుళంలో ప్రారంభించినప్పుడే చెప్పాం. ప్రజలు సుఖశాంతులతో ఉంటే చంద్రబాబుకు మనశ్శాంతి లేకపోవడంతో జనాల మధ్య విధ్వేషాలు సృష్టించే ప్లాన్‌లో ఉన్నారని ముందే చెప్పాం. కోనసీమలో అల్లర్లుకు సంబంధించి 70మందిని పోలీసులు పట్టుకుంటే, వారిలో ఎక్కువమంది టీడీపీ, జనసేన కార్యకర్తలే ఉండటం సిగ్గుచేటు.

బాబు 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా..?
    బాలకృష్ణగారిని చూస్తే చాలా బాధేస్తోంది. తండ్రికి తగ్గ తనయుడిగా ఉండి ఉంటే, ఎన్టీఆర్‌గారు చనిపోయినప్పుడు బాలకృష్ణగారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల అమాయకత్వాన్ని వాడుకుని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, వాళ్లను ఏ విధంగా బయటపడేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్ కుటుంబాన్ని దూరంగా ఉంచిన చంద్రబాబు, మళ్లీ తన అధికారం కోసం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవడం కూడా చూశాం. చంద్రబాబు 14ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని నిమ్మకూరు అభివృద్ధి, ఈరోజు బాలకృష్ణ అక్కడకు వెళ్ళి,  ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుతామని, ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్టామని  చెప్పడం అమాయకమా? మరొకటా అనేది అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా బాలకృష్ణగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ గారి విగ్రహం పెట్టాలని ఎందుకు గుర్తుకు రాలేదు.?

-  ఎన్టీఆర్‌ గారిని గౌరవిస్తామని జగన్‌ మోహన్‌రెడ్డిగారు ప్రతి సమావేశంలోనూ చెప్పేవారు. అందుకు నిదర్శనంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌  పేరును పెట్టడం జరిగింది. అందుకు ముందుగా ఎన్టీఆర్‌ గారి కుటుంబం జగన్‌ గారికి థ్యాంక్స్‌  చెప్పాలి. అలాగే నిజమైన ఎన్టీఆర్‌ గారి భక్తులు, ఆయన అభిమానులు ఇంకా ఎవరైనా ఆ పార్టీలో మిగిలి ఉంటే టీడీపీ మహానాడులో ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టినందుకు ధన్యవాదాల తీర్మానం పెట్టాలి. కానీ అలా జరగలేదు. అలా చేయలేదం‍టే ఇప్పుడున్నది ఎన్టీఆర్‌ గారి తెలుగుదేశం పార్టీ కాదు. నారావారి నకిలీ తెలుగుదేశం పార్టీ. అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ. డూప్లికేట్‌  టీడీపీ పార్టీ అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే, కొడాలి నాని గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి,  నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటన చేయడం కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్‌ అభిమానుల కళ్లనీళ్లు తుడవడానికి బాలకృష్ణ గారు మాట్లాడితే ఎవరూ హర్షించరనేది తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీ బావ చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్ట్‌  చదవడం మానేసి, ఎన్టీఆర్‌  కొడుకుగా, డైనమిక్‌ లీడర్‌గా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడండి.

మహిళలపై దాడులంటూ టీడీపీ విష ప్రచారం
    జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాకే మహిళలపై దాడులు ఎక్కువ అయ్యాయంటూ టీడీపీ విష ప్రచారం చేస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే  మహిళా ట్రాఫికింగ్‌లో నెంబర్‌ వన్‌గా, అత్యాచారాల్లో తొలిస్థానంలో చంద్రబాబు నిలిపారు. ఈ విషయాన్ని ప్రజలెవరూ మర్చిపోలేదు. జగన్‌ గారు ఇద్దరు ఆడబిడ్డల తండ్రిగా, రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంభన కల్పిస్తూ, మరోవైపు రాజకీయాల్లో ఎదగడానికి 50శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, మహిళలకు రక్షణ కల్పించడానికి దిశ చట్టం, యాప్‌, దిశా పోలీస్‌ స్టేషన్లను తీసుకువచ్చారు. కోటి మందికి పైగా దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే వాళ్ల దగ్గరకు వెళ్లడానికి 3వేలకు పైగా పెట్రోలింగ్‌  వాహనాలును పెట్టడం జరిగింది. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించకపోయినా..  ఆ స్పూర్తిని తీసుకుని పోలీసు శాఖ ఏవిధంగా మహిళలకు రక్షణ కల్పిస్తుందో మనమంతా చూస్తున్నాం.

 - ఎక్కడో జరిగిన సంఘటనలను భూతద్దంలో పదే పదే చూపిస్తూ, జగనన్నపై బురదచల్లే ప్రయత్నం చేస్తే ఎవరూ సహిస్తూ ఊరుకోరు. జగనన్న మహిళా పక్షపాతి. దాదాపుగా 80 నుంచి 90 శాతం సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసి, ఆ కుటుంబంలో గౌరవాన్ని ఇచ్చి రక్షణ కల్పిస్తున్నారు కాబట్టే మహిళలంతా జగనన్నను ఆశీర్వదిస్తున్నారు. 

- టీడీపీ మహానాడులో ఒకరిద్దరు మహిళలతో జగనన్నను నోటికొచ్చినట్టు దూషిస్తూ సంబరపడుతున్నారు. కానీ, 2024లో జరగబోయే ఎన్నికలకు రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడే డిసైడ్‌ అయిపోయారు క్విట్‌ చంద్రబాబు... క్విట్‌ తెలుగుదేశం అని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరోసారి కిక్ ఇస్తే.. టీడీపీ ఎక్కడో పడుతుంది. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రిగారికి కనీస గౌరవం లేకుండా మాట్లాడటం చూస్తే ఇంట్లో వాళ్ల పెంపకం​ ఎలా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top