క్విట్‌ చంద్రబాబు.. సేవ్‌ ఏపీ నినాదంతో ఎన్నికలకు..!

మంత్రి ఆర్కే రోజా
 

తిరుప‌తి: క్విట్‌ చంద్రబాబు… సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు.  ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు  దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్నారు.  కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని సూచించారు.. 14 సంవత్సారాలు సీఎంగా వున్నా చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని కనీసం రెవెన్యూ డివిజన్‌గా కూడా చేయలేని అసమర్థుడు అంటూ ఫైర్‌ అయ్యారు. మేం ప్రజల్లో ధైర్యంగా తిరుగుతుంటే.. వాళ్లు మీడియా ముందు డ్యాన్సులు వేస్తున్నారు అంటూ రోజా విమర్శించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top