రాజధాని అమ‌రావ‌తి పేరుతో చంద్రబాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం

రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు
 
ఉత్త‌రాంధ్ర ద్రోహులుగా టీడీపీ నాయ‌కులు మిగిలిపోతారా ?

విశాఖను రాజ‌ధానిగా చేయ‌డంపై ఉత్తరాంధ్ర టీడీపీ నాయ‌కులు త‌మ స్టాండ్ ఏంటో చెప్ప‌గ‌ల‌రా ?

స్టేడియం పనుల పూర్తికి కట్టుబడి ఉన్నాం
 
అసత్యాలతో చంద్రబాబు కాలం గడిపేస్తున్నారు

ప్రజలను చంద్రబాబు మోసం చేశారు

పరిపాలన వికేంద్రీకరణను సాధ్యం చేసింది జగనే.. విధాన నిర్ణయాలలో బెస్ట్ ప్రాక్టీస్ తీసుకుని వచ్చారు
 
కరప్షన్ లెవల్స్ తగ్గించలేదా ? ఈ పని ఎవరు చేశారు ? శ్యాచురేషన్ కాన్సెప్ట్ ను తీసుకుని వచ్చారు జగన్

చంద్రబాబు వ్యాపారస్తుడు.. దోపిడీదారుడు

శ్రీ‌కాకుళం: ఉత్త‌రాంధ్ర ద్రోహి చంద్ర‌బాబు అని, ఈ ప్రాంతం అభివృద్ధికి ఏనాడూ క‌ట్టుబ‌డి లేరు అని, విశాఖ‌ను రాజ‌ధానిగా చేసే విష‌య‌మై ఇక్క‌డి టీడీపీ నాయ‌కులు త‌మ స్టాండ్ ఏంటో చెప్ప‌గ‌ల‌రా ? ఈ ప్రాంత ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌ని నాయ‌కులు ఎన్నిక‌ల్లో ఓట్లేయ‌మ‌ని అభ్య‌ర్థిస్తున్నారా ? గ‌తంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి ప‌ట్ట‌క చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రించారు. విభ‌జ‌న‌లో భాగంగా మ‌న‌కు ద‌క్కిన 23 కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌లో ఒక్క‌టి కూడా ఈ జిల్లాలో ఏర్పాటు చేయ‌కుండా ఆయ‌న ద్రోహం చేశారు అనేందుకు ఆధారాలు ఉన్నాయ‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు.

కోడి రామ్మూర్తి స్టేడియం పనుల పూర్తికి కట్టుబడి ఉన్నాం అని రెవెన్యూ మంత్రి పేర్కొన్నా రు. ఇప్పటికే నిధులు కేటాయించి పనులు కొంత మేర పూర్తి చేయించాం అని,మిగిలిన పనులు పూర్తి  చేయించేది కూడా తానేన ని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేత చంద్రబాబుకు ప్రజలు కానీ వారి సమస్యలు గుర్తుకు రావు అని,అధికా రం పోగానే వారిపై ప్రేమ నటిస్తుంటారని విమర్శించారు. రాజధాని పేరిట మన ప్రాంత ప్రజల పీక నొక్కేశారని,మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖే రాజధాని అని,పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తామని అన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ ని శనివారం ఉదయం కలిశారు. ప్ర‌భుత్వ విధానాలు.,వాటి వెనుక ఉన్న ఉద్దేశాల‌ను వివ‌రించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఐదేళ్లకూ ఎన్నికలు వస్తాయి. రానున్న ఎన్నికల్లో మీరంతా తోడుగా ఉండాలని అభ్యర్థించేందుకు ఇక్కడికి వచ్చాను. ఐదేళ్లు అధికారంలో ఉన్నాం..ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్నికల్లో  ఇప్పటి వరకూ మేం ఏం చేశాం అన్నది చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. రాష్ట్రంలో మన ప్రభుత్వం అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి. కేంద్రం విడుదల చేసిన సూచీలు పరిశీలిస్తే..తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి .. ఏంటన్నది. టీడీపీ హయాంలో జీఎస్డీపీ 22 వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5 వ స్థానంలో ఉంది.. తలసరి ఆదాయం 17 వ స్థానంలో ఉంటే,ఈ ప్రభుత్వ కాలంలో 9 వ స్థానానికి వచ్చాం.

75 ఏళ్ల స్వతంత్ర దేశంలో.. మన రాష్ట్రంలో 4 సీ పోర్టులకు సంబంధించి ఈ 5 ఏళ్లలోనే నిర్మాణాలు చేపట్టాం. అన్నీ పూర్తి కావొ స్తున్నాయి.. వాటి ఫలితాలు రానున్న రోజుల్లో చూస్తాం. అందులో ఒకటి మన జిల్లాలో మూలపేట లో 4 వేల కోట్లతో నిర్మాణం జరుగుతున్నాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉద్దానం వెళ్ళారు. చూశారు కానీ సమస్యను పరిష్కరించలేకపోయారు. మళ్ళీ ఓ పక్క సీనియర్ పొలిటీషియన్ ని అంటారు. కానీ శ్రీకాకుళానికి మీరు ఏం చేశారు చంద్రబాబు ? అని ప్రశ్నిస్తున్నాను. టీడీపీకి గతంలో ఈ జిల్లా తోడుగా ఉంది. కానీ ఆ పార్టీ నేతృత్వాన్ని నడిచిన ప్రభుత్వం కానీ ప్రభుత్వాధిపతి కానీ మన జిల్లాకు చేసిందేం లేదు. మొదటి సారి సీఎం అయిన జగన్ మన జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించారు. ఉద్దానం ప్రజల ఇబ్బందిని గ్రహించి,ఈ ప్రభుత్వంలోనే సంబంధిత పనులకు శంకుస్థాపన చేశారు. సర్ఫేస్ వాటర్ అందించేందుకు పనులు చేపట్టి పూర్తి చేసి సంబంధిత ప్రాజెక్టును ప్రారంభించారు.

విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం 23 సంస్థలు ఇస్తే,ఒక్కటి కూడా మన జిల్లాకు కేటాయించలేదు.
ఈ విషయాలపై శ్రీకాకుళం టీడీపీ నాయకు లు ఎందుకు మాట్లాడరు ? టీడీపీ హయాంలో మన జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాస్పత్రి ఎంత అధ్వానంగా ఉండేదో ! 900 బెడ్స్ మేము అందుబాటులోకి తీసుకు వచ్చాం. అలానే ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశాం. తద్వారా వైద్య రంగాన్ని బలోపేతం చేశాం. విద్య,వైద్య రంగాలలో సమూల మార్పులు చేశాం. 

స్టేడియం పనులకు సంబంధించి చంద్రబాబు నాయుడు సమయంలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వలేదు.
 మన ప్రభుత్వ హయాంలో రూ.12 కోట్లు కేటాయించాం. అప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏజెన్సీకి టెండర్ ఇచ్చారు కనుక దాన్ని  క్యాన్సిల్ చేయించేందుకు లీగల్ బ్యాటిల్ చేయాల్సి వచ్చింది. అందుకు చాలా సమయం పట్టింది. తరువాత టెండర్ పిలిచాం. ఇవాళ స్టేడియం కంప్లీట్ కాకపోవచ్చు. కానీ కంప్లీట్ చేసేందుకు కారణం ధర్మాన ప్రసాదరావు కాదా ? అని అడుగుతున్నాను. పడగొట్టింది ఎవరు ? సమ్మెట పెట్టి కూలగొట్టింది ఎవరు ? ఏం నువ్వు ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వలేదు. ? అలానే శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 40 కోట్ల రూపాయలు తెప్పించడం జరిగింది. ఇందుకు  చీఫ్ ఇంజినీర్ రామచంద్రరావు ఎంతగానో సహకరించారు. ఆయన సూచన మేరకు నేను ఈ రోడ్డు పనులను ప్రతిపాదించాను. టెండర్ పిలిచారు. టెండర్ ఎవరికో కన్ఫం అయింది. టెండర్ తీసుకున్నవారు నా దగ్గరకు వచ్చారు. నాకు కావాల్సింది మంచి నాణ్యతతో కూడిన పనులు చేపట్టమని చెప్పాను. 14 కోట్లు పనులు చేశాడు. బిల్లులు చెల్లించాల్సి ఉంది. పేమెంట్ ఇవ్వడానికి ఔట్ ఆఫ్ టర్న్ ఇవ్వాల్సి వస్తుంది. ఔట్ ఆఫ్ టర్న్ కు పిటిషన్ పెట్టారు విపక్ష నేతలు. వీళ్లు ఇష్టం వచ్చిన విధంగా బిల్లులు ఇచ్చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దాంతో ఔట్ ఆఫ్ టర్న్ కాకుండా ఆర్డర్ లో ముందు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించుకుంటూ రావాలని చెప్పారు. దాంతో ముందు పెండింగ్ ఉన్న రెండు వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉన్నందున వాటిని చెల్లించాకే ఈ రోడ్డు పనులకు సంబంధిం చిన బిల్లు క్లియర్ చేయాల్సి ఉంది. నేను రోడ్డు పనులకు సంబంధించి మన ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకు వచ్చాను. చీఫ్ సెక్రటరీతోనూ, ప్రిన్సిపల్ సెక్రటరీతోనూ మాట్లాడాను. నేను ఈ పనులు ఓ వైపు చేస్తుండగానే వీళ్లేమో ఈసీ దగ్గర పిటిషన్ వేశారు. దాంతో బిల్లుల చెల్లింపు ల్లో ప్రతిష్టంభన అన్నది నెలకొంది. వీళ్లందరికీ ఎన్నికలలో ప్రయోజనమే తప్ప.. ప్రజలకు మేలు చేయాల న్న తలంపు వీళ్లకు లేదు. సమాజం పై బాధ్యత కలిగిన వారు చంద్రబాబా ? జగనా అన్నది మీరు ఒక్కసారి ఆలోచించాలి. అలానే.. అధికారుల అంతా ఒకే చోట ఉంటూ పనిచేసే విధంగా ముఖ్య విభాగాలన్నీ ఒకే చోట పనిచేసే విధంగా జిల్లా కేంద్రాన పరిపాలన భవనం ఉండాలి అని భావించి,ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణం చేపట్టాం. ఈ పనులనూ పూర్తి చేయించనున్నాం.  

విద్యతోనే సమాజంలో అసమానతలు తగ్గించగలం అని గట్టిగా నమ్మి గ్రౌండ్ లెవెల్ నుంచే మార్పులు చేపట్టారు జగన్.
సమా జంలో మార్పు చిర స్థాయిలో ఉండిపోవాలని జగన్ భావించి,అందుకు తగ్గ సంస్కరణలను తీసుకుని వచ్చారు. ఈ మార్పులన్నీ కేవలం ఐదేళ్లలో జరిగాయి. పరిపాలన వికేంద్రీకరణ అంటూ ఇప్పటి వరకూ కాలం గడిపాం. కానీ జగన్ నిజం చేశారు. 

చంద్రబాబు వ్యాపారస్తుడు. దోపిడీదారుడు.* రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రాజధాని పనుల కోసం 3 లక్షల కోట్ల పెట్టుబడి ఉండాలి,టీడీపీ అధికారంలో ఉన్నపుడు 5 వేల కోట్లు పెట్టారు. కానీ పనులలో ఏపాటి పురోగతి కూడా లేదు. అమరావతి నిర్మాణం అవ్వాలి అంటే మరో 60 ఏళ్లు వేచి ఉండాలి. అలాంటప్పుడు శ్రీకాకుళం లాంటి వెనుక బడిన జిల్లాలు ఏం కావాలి ? ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయగలం ? డబ్బులన్నీ రాజధాని పనులకే కేటాయిస్తే మిగిలిన ప్రాంతాలన్నీ ఏం కావాలి ? ఏమైపోవాలి ? చంద్రబాబు చేసింది అభివృద్ధి కాదు మోసం. రాజధాని ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం నియమించిన శివ రామ కృష్ణ కమిటీని సూచనలు కూడా పక్కకు పెట్టారు చంద్రబాబు. 58 వేల ఉద్యోగాలను వైద్య రంగంలో భర్తీ చేశాం. 14 ఏళ్లలో చెప్పుకోదగ్గ పని ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు హయాంలో టీడీపీ చేసింది అని చెప్పగలరా ?  కేంద్రం నుంచి ఎప్పుడూ రానన్ని నిధులు ఈ 5 ఏళ్లలో తెచ్చుకోగలిగాం.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాం.
ఈ మాట ధైర్యంగా టీడీపీ నాయకులు చెప్పగలరా..? హైద్రాబాద్..లో చంద్రబాబు ఉంటూ..ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడుతారు.. జగన్ ప్యాలెస్..లో ఉన్నాడు అంటారే.. కానీ ప్రతి పేదవాడి ఆకలినీ తీర్చేందుకు ఆలో చనలు చేసే భవనం అది. చంద్రబాబు పక్క రాష్ట్ర ప్యాలెస్..లో ఉంటాడు. ఇంకో సినిమా యాక్టర్ ఫ్లైట్ లో వచ్చిఫ్లైట్ లో హైద్రాబాద్ వెళ్లిపోతారు. మన జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు,రామ్మోహన్ నాయుడు,కూన రవి కుమార్ లు విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటుకు సంబంధించి తమ స్టాండ్ ఏంటో చెప్పగ లరా ? మీరు వ్యాపారం చేసుకోవాలి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా ? మన ప్రాంత ప్రజల పీక నొక్కారు. మీరు ఇవన్నీ గుర్తించి మీ అందరికీ మేలు చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని కోరుతున్నా ను. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

Back to Top